స్త్రీ జీవితంలో పెళ్లి అతి ముఖ్యమైన భాగం.. పెళ్లి తర్వాత చాలావరకూ ఆడవారు ఇంటి బాధ్యతల్లో తలమునకలవుతారు. పెళ్లికి ముందు గంటల తరబడి అద్దం ముందు కూర్చున్న వారు సైతం.. పెళ్లి తర్వాత అసలు తాము ఎలా ఉన్నామో కూడా పట్టించుకోరు. అందుకే ఈ పరిస్థితి మార్చేందుకు అందాల పోటీలు ఉపయోగపడుతున్నాయి.


పెళ్లి తర్వాత కూడా తమ అందాన్ని కాపాడుకోవాలని.. నలుగురిలో గుర్తింపు పొందాలని కోరుకునే వారి కోసం విజయవాడలో శ్రీమతి అమరావతి-2019 పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ ఫ్యాషన్‌ షో నిర్వహించారు. తేజాస్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.


ఒక్క విజయవాడ నుంచే కాదు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది మహిళలు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలతో ర్యాంప్‌ మీద క్యాట్‌ వాక్‌ చేశారు. తమ అందాలను ఆరబోశారు. పెళ్లి కారణంగా కాస్త బొద్దుగా మారినా ఏమాత్రం సిగ్గుపడకుండా ర్యాంప్ మీద హొయలొలికిస్తూ నడిచారు. ఈ కార్యక్రమంలో మిసెస్‌ తెలంగాణ టైటిల్‌ విజేత స్నేహచౌదరి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.


ఆమె ఈ ఫ్యాషన్‌షోను కండక్ట్ చేశారు. వివాహం అతివల ప్రతిభకు ఏ మాత్రం అడ్డు కాకూడదంటున్నారు ఈ షో నిర్వాహకులు. ఇక ఈనెల 20న ఇబ్రహీంపట్నంలో శ్రీమతి అమరావతి-2019 ఫైనల్స్‌ జరగనున్నాయి. ఈ కార్యక్రమం విజేలకు సినీ నటి ప్రేమ చేతుల మీదుగా టైటిల్‌ అందిస్తారట.


మరింత సమాచారం తెలుసుకోండి: