నాటుకోడి.. రాగి సంగటి అబ్బా ఎంత బాగుంటుందో.. నాటుకోడి, రాగి సంగటి అని అంటూనే రాయలసీమ వారికీ నోరు ఊరిపోతోంది. రాయలసీమలోనే ఉంటె మేము రోజు తింటున్నాం లే అని అనుకుంటారు కానీ ఉపాధి నిమిత్తం పట్టణానికి వచ్చి స్థిరపడ్డ వారు హోటల్స్ లో చేసినవి తినలేక, అవి తినకుండా ఉండాలేకా కష్టాలు పడుతుంటారు. అయితే అలంటి వారు.. నాటుకోడి పులుసు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 


కావలసిన పదార్థాలు :


నాటుకోడిమాంసం - 1 కిలో


ఉల్లిపాయలు - 2


ఉప్పు - తగినంత


పసుపు - కొద్దిగా


కారం - 2 స్పూన్స్


ధనియాల పొడి - 1 స్పూన్


ఎండుమిర్చి - 7


దాల్చిన చెక్క - చిన్న ముక్క


నూనె - సరిపడా


గసగసాలు - అరస్పూన్


కొబ్బరి తురుము - 2 స్పూన్స్


వెల్లుల్లి గడ్డ - 1


అల్లం - చిన్న ముక్క


మిరియాలు - అరస్పూన్ 


నాటుకోడి పులుసు తయారీ విధానం... 


నాటుకోడి పులుసు చేసే ముందు కొబ్బరి, గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు ముక్కలు మిక్సీ లో వేసి పేస్ట్ గా తాయారు చెయ్యాలి. యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, గసగసాలు బాగా వేయించి పొడిచేసి పక్కన పెట్టాలి. తర్వాత కుక్కర్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకుని ముందుగా తయారుచేసుకున్న అల్లం వెల్లులి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కారం, ధనియాల పొడి వేసి తగినన్ని నీరు పోసి బాగా ఉడికించాలి. చివరగా పొడిచేసి పెట్టుకున్న మసాలా వేసి 5 నిమిషాల పాటు ఉడికించి తీసుకుంటే వేడివేడి టేస్టీ నాటుకోడి పులుసు తయారవుతుంది. తరువాత రాగి సంగటిలో కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అని అంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: