అమ్మ అవ్వడం ప్రతి మహిళకు ఓ వరం.. ప్రతి మహిళా తల్లి కావాలని అనుకుంటుంది. కానీ కొందరికి ఈ వరం లభించదు. అయితే కొంతమంది మహిళలకు తల్లి అవుతున్నాం అని తెలిసిన వెంటనే ఆనందానికి అవధులు ఉండవ్. అయితే మహిళా గర్భం దాల్చిన సమయం మన పెద్దలు ఎన్నో మూఢనమ్మకాలతో ఉండేవారు. అయితే ఆ మూఢనమ్మకాలు ఏంటో ఒకసారి ఇక్కడ చదివి తెలుసుకోండి. 


ప్రెగ్నెన్సీ అని అందరికి చెప్తే అబార్షన్.. 


మహిళకు ప్రెగ్నన్సీ వచ్చినప్పుడు ఎంతో ఆనందపడుతుంది. అయితే ఆ విషయాన్నీ అందరికి చెప్పకూడదు అట.. ఆలా చెప్తే అబార్షన్ అవుతుంది అని పెద్దలు చెప్పేవారు. దీంతో ప్రెగ్నన్సీ ఉన్న మహిళలు వారు గర్భవతులు అని బయటకు చెప్పేవారు కాదు. అయితే అది నిజం కాదు అని.. అందులో ఏమాత్రం నిజం లేదు అని కొందరు చెప్పేవారు. అది కేవలం మూఢనమ్మకం అని కూడా తేలింది.  


ఎక్కువ నొప్పులు వస్తే అబ్బాయి.. 


సాధారణంగా మహిళలు ఎక్కువ పని చేస్తారు కనుక కీళ్ల నొప్పులు, ఆలా ఉంటాయి. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ వస్తే అబ్బాయి పుడతాడు అని పెద్దలు చెప్తుంటారు. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు అని కొందరు గర్భవతులు నిరూపించారు. కాగా అది పెద్దలు నమ్మే ముద్ర నమ్మకం అని తేల్చి పడేసారు. 


చనిపోయిన వారిదెగ్గరకు వెళ్తే మంచిది కాదు.. 


గర్భంతో ఉన్న మహిళలు చనిపోయిన వారి దగ్గరకు వెళ్లొద్దు అని.. అది అంత మంచిది కాదు అని.. ఒకోసారి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయే పరిస్థితి ఉంటుంది అని పెద్దలు అనేవారు. అయితే కొందరు మహిళలు గర్భంతో ఉన్న సమయంలోనే ఇంట్లో వారు చనిపోతే అక్కడే ఉండే వారు. అయినప్పటికీ కొంతమంది మహిళలకు గర్భంలో ఎలాంటి మార్పు ఉండేది కాదు. 


అరటి పండు తింటే అబ్బాయి... 


ఏంటి ? కామెడీనా.. అరటి పండు తింటే అబ్బాయి.. యాపిల్ పండు తింటే అమ్మాయి పుట్టడానికి. ఇది కూడా కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే అని.. అరటి పండు వల్ల పొటాషియంతో పాటు ఇతర పోషకాలు ఉంటాయని కొన్ని పరిశోధనల్లో తేలాయి. అయితే అప్పట్లో అరటి పండు తినాలని గర్భవతులకు పెద్దలు ఆలా చెప్పేవారిని తేలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: