చికెన్ పకోడీ. ఈ చల్లటి వర్ష కాలంలో వేడి వేడి చికెన్ పకోడీ తింటే ఉంటది.. ఆ రుచే వేరు. ఆ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ చికెన్ పకోడీ ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు. అయితే ఎలా చేస్తే అదిరిపోతుందో.. ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకొండి.


కావలసిన పదార్ధాలు.. 


చికెన్‌ - పావు కేజీ, 


అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, 


సెనగపిండి - రెండు కప్పులు, 


జీలకర్ర - ఒక టీస్పూన్‌, 


ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, 


బేకింగ్‌సోడా - చిటికెడు, 


కొత్తిమీర - ఒక కట్ట, 


పుదీనా - ఒక కట్ట, 


నూనె - తగినంత, 


ఉప్పు - సరిపడెంత.. 


తయారీ విధానం.. 


చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి తీసుకొని, జీలకర్ర, ధనియాలపొడి, బేకింగ్‌ సోడా, కొత్తిమీర, పుదీనా వేసి, తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలియబెట్టాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలను ఈ మిశ్రమంలో అద్దుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. అంతే వేడి వేడి చికెన్ పకోడి రెడీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: