అబ్బా గ్యాస్.. పొట్టలో మంట... అజీర్తి సమస్యలు.. ఇంకా దాహం తీరలేదు... కళ్ళు తిరుగిడుతున్నాయి ఇలా ఒక్కటేంటి అన్ని రకాల సమస్యలకు..మంచి మెడిసిన్ ఒక్కటే పెరుగు.. తక్కువ ధరలో ఎక్కువ లాభాలున్నా ఈ పెరుగులో చాలా పోషకాలున్నాయి. ఈ పెరుగుతో మంచి మసాలా స్మోకేడ్  చాస్ తయారు చేసుకోవచ్చునట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

కావలసిన పదార్థాలు.. 
పెరుగు - ఒక కప్పు; 
పుదీనా ఆకులు - అర కప్పు;
 కొత్తిమీర - అర కప్పు; 
నీళ్లు - పావు కప్పు; 
ఉప్పు - తగినంత; 
అల్లం తురుము - అర టీ స్పూను; 
బొగ్గు ముక్కలు - 2; 
కరివేపాకు - 5 ఆకులు; 
జీలకర్ర - 2 టీ స్పూన్లు; 
పచ్చి మిర్చి - 4 (సన్నగా తరగాలి); 
నూనె - ఒక టీ స్పూను.

తయారీ విధానం:
మిక్సీలో పెరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, అల్లం తురుము, ఉప్పు వేసి తిప్పాలి.. ఇకపోతే కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి.. మజ్జిగను ఒక పాత్రలోకి తీసుకోవాలి ఒక పాత్రలో కరివేపాకు, పచ్చి మిర్చి, జీలకర్ర ఉంచాలి బొగ్గును స్టౌ మీద కాల్చి, ఆ బొగ్గును చిన్న పాత్రలోకి తీసి, వెంటనే ఆ పాత్రను మజ్జిగ మీద ఉంచాలి. నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్రలను మండుతున్న బొగ్గు మీద వేసి సిల్వర్‌ ఫాయిల్‌తో వెంటనే మూసేయాలి.  బొగ్గు మీద నుంచి వచ్చే పొగ మజ్జిగలోకి చేరి, కొత్త రుచి వస్తుంది.  ఐదు నిమిషాల తరవాత సిల్వర్‌ ఫాయిల్‌ తీసేయాలి.. బొగ్గును తీసి పడేయాలి.. మజ్జిగను గ్లాసులలోకి పోసి, పుదీనా ఆకులతో అలంకరించి అందించాలి. ఏంటో కొత్తగా ఉంది కదా అయినా పర్లేదు ఓ సారి ట్రై చేయండి ఏమౌతుంది.. మంచిదేగా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: