గోంగూర పచ్చడి.. మాములుగా గోంగూర పచ్చడి చేస్తారు.. ఇంట్లో అమ్మ అయితే కమ్మగా వండిపెడుతుంది. కానీ హోటల్స్ అంత బాగా చేసి పెట్టారు కదా.. ఎక్కడెక్కడ నుండో వచ్చి హాస్టల్ లోనో, రూమ్ లోనో లేదా కొత్తగా పెళ్లి చేసుకొనో ఇలా ఎలాగోలా ఇంట్లో అమ్మ చేసే గోంగూర పచ్చడిని మిస్ అవుతూ ఉంటారు.. అయితే అమ్మ చేసే పచ్చడిని మనం చేసుకోవాలంటే ఎలానో తెలీదు.. అలాంటివారు ఆ పచ్చడిని ఇలా చేసుకొని తినండి. 


కావాల్సిన పదార్ధాలు.. 


గోంగూర - 5 కట్టలు, 


చెనిక్కాయిలు - 1 కప్పు, 


ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, 


ఎండు మిరపకాయలు - ఎనిమిది, 


ధనియాలు - 2 టేబుల్‌ స్పూన్లు, 


ఉప్పు - తగినంత, 


నూనె - సరిపడేంత .


తయారీ విధానం.. 


ముందుగా చెనిక్కాయిలు వేయించి పక్కన పెట్టుకోవాలి. పోయి మీద పెద్ద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ధనియాలు, ఎండు మిరపకాయ ముక్కలు వేసి వేయించిన తరువాత గోంగూర కూడ వేసి బాగా మగ్గనివ్వాలి. వేడి చల్లారిన తర్వాత మిక్సీలో ముందు పల్లీలను పొడిచేసి అందులో ఈ గోంగూర ముద్ద, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. అంతే నోరూరుంచే గోంగూర చెట్నీ రెడీ అవుతుంది. ఇది రాగి సంగటిలో కానీ ముద్దలో కానీ నెయ్యితో వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: