తన తల్లికి భర్త కావాలంటూ ఓ 22 ఏళ్ల అమ్మడు పెట్టిన ట్విట్టర్ పోస్టు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా తల్లిదండ్రులు.. పెళ్లీడు వచ్చిన పిల్లల కోసం సంబధాలు చూస్తుంటారు. కానీ ఇక్కడ పెళ్లీడుకొచ్చిన పిల్ల.. తల్లి కి తోడు కోసం వెదకడం ఆసక్తి రేపుతోంది.


తన తల్లికి పెళ్లి చేసేందుకు మంచి వరుడును చూస్తున్నానంటూ లా చదువుతన్న ఆస్తా వర్మ అనే విద్యార్ధి ఈ ట్వీట్ చేసింది. ఆస్తా వర్మ అనే అమ్మాయి. తన తల్లి కోసం మంచి వరుడు కావాలంటూ…ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘ 50ఏళ్ల వయసుపైబడిన హ్యాండ్‌ సమ్ వ్యక్తి, ప్యూర్ వెజిటేరియన్, మద్యం తాగనివాడు, ఆర్థికంగా స్థిరపడినవాడు’ తన తల్లి కోసం చూస్తున్నానని కూతురు ట్వీట్ చేసింది.


చాలామంది ఆస్తా ట్వీట్ కు పాజిటివ్ గా స్పందించారు. చాలా మంచి పని చేస్తోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గొప్ప కూతురంటూ కితాబిస్తున్నారు. మరికొందరు… మేం కూడా మా వంతు సాయం చేస్తూ మంచి వరుడ్ని వెతుకుతామంటూ రిప్లై ఇస్తున్నారు. అస్తా చేసిన ట్వీట్‌తో పాటు తన తల్లితో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. మరి ఆస్తా ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: