ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా సంచలనం సృష్టించిన ఈ నేరం అత్యంత హేయమైనది. మహిళా జాతికే తలవంపులు తెచ్చేదిగా ఉంది. మగాడైన ఒక మహిళ అనేక మందిపై అత్యాచారాలకు పాల్పడి౦ది. మహిళేమిటి సాటి మహిళలను రేప్ చేయడమేమిటని మీ అనుమానమా..?  అయితే చూడండి... ఒంగోలుకు చెందిన సుమలత అనే మహిళ. కానీ ఆమె రూపం పురుషుడిని పోలి ఉంటుంది వస్త్రధారణ కూడా పురుషుడు లాగే చేసుకుంటుంది. మాటైతే మగాడు మాట్లాడినట్లు ఉంటుంది. సుమలత ఆలోచనలు అసహజ శృంగారం వైపు మళ్లడంతో అనేక నేరాలు, ఘోరాలు జరిగిపోయాయి. ఆమె చీకటి కోణాలు చూసిన పోలీసులు నివ్వెరపోతున్నారు. 


ఒంగోలులో నూడిల్స్ బండి  నిర్వాహకుడు అయిన ఏడుకొండలు అనే వ్యక్తితో కలిసి సుమలత సహజీవనం చేస్తోంది. వారికి  సిమ్ కార్డులు విక్రయించే వంశి అనే యువకుడు కూడా తోడయ్యాడు. సిమ్ కార్డులు అమ్మే క్రమంలో యువతల చిరునామాలు సేకరించి  సుమలతకి ఇచ్చేవాడు. సుమలత సాయి తేజ రెడ్డి పేరుతో అలాంటి కొందరు యువతులకు వలలు వేసేది. వీరి గాలానికి చిక్కిన యువతులకు మత్తు మందు ఇచ్చి ఏడుకొండలు వంశీ సుమలత లు రేప్ చేసి అనుభవించేవారు. సుమలత ఇందుకోసం సెక్స్ టాయ్స్ ను ఉపయోగించేది. ఇలా వారు ఎందరి జీవితాలనో నాశనం చేశారు. 


జరుగుమిల్లికి చెందిన ఒక మైనర్ బాలిక తనకు ఇలాగే జరగడంతో నేరుగా స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్పష్టమైన సమాచారం ఆ బాలిక ఇవ్వడంతో పోలీసులు ఒంగోలులో మారుతి నగర్ లో  ఉంటున్న నిందితుల ఇంటిపై పోలీసులు మెరుపు దాడి చేయగా వారి నుండి తప్పించుకునే క్రమంలో ఏడుకొండలు మేడపై నుండి దూకి మృతి చెందాడు. వంశీ సుమలత దొరికిపోగా.. వారిని అరెస్టు చేసి సెక్స్ టాయ్స్ స్వాధీనపరుచుకున్నారు.

కాగా ఈ నేరాల్లో ఉన్నాడని చెపుతున్న సాయితేజరెడ్డి అనే పాత్ర అసలు లేదని సుమలతే సాయి తేజా రెడ్డి అని పోలీసులు వివరించారు. 
అలాగే వారి సెల్ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని కాల్ డేటా పరిశీలిస్తున్నారు. ఇలాంటి నేరాన్ని ఇంతకుముందు ఎప్పుడూ తాను తన సర్వీసులో చూడలేదని ఒక పోలీసు అధికారి చెప్పారు. దీని వెనుక ఇంకా పెద్ద కథ ఒకటి ఉంటుందన్న అనుమానంతో అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆ అధికారి వివరించారు. స్పందనలో అందిన ఫిర్యాదు మీద జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సరైన రీతిలో స్పందించడంతో అతిపెద్ద నేరం బయటపడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: