పన్నీర్ ఎగ్ కర్రీ.. పన్నీర్ అంటేనే చాలామందికి నోరు ఊరిపోతోంది. అలాంటిది పన్నీర్ ఎగ్ కర్రీ అంటే నోరు ఉరిపోదు. అయితే ఎంతోమంది ఇలా తినాలి అని ఉన్న.. ఆ కర్రీ ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు. అలాంటి వారు ఆ పన్నీర్ ఎగ్ కర్రీ ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


కావలసిన పదార్థాలు.. 


పనీర్‌ తురుము- ఒక కప్పు,


ఎగ్స్-4,


పసుపు- పావు టీ స్పూను,


కార్న్‌ఫ్లోర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు,


నూనె- వేగించడానికి సరిపడా,


బిర్యానీ ఆకులు- రెండు,


దాల్చిన చెక్క- ఒక అంగుళం ముక్క, 


యాలకులు- ఒకటి, 


లవంగాలు- మూడు, 


జీలకర్ర- ఒక టీ స్పూను, 


కారం- మూడు టీ స్పూన్లు, 


తరిగిన ఉల్లిపాయ- ఒకటి, 


అల్లం వెల్లుల్లి ముద్ద- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్, 


పసుపు- అర టీ స్పూను, 


ధనియాల పొడి- ఒకటిన్నర టీ సూన్, 


జీలకర్ర పొడి- ఒక టీ స్పూను, 


ఆమ్‌చూర్‌ పొడి- టీ స్పూను, 


గరం మసాలా- అర టీ స్పూను, 


ఉప్పు- తగినంత.


తయారీ విధానం.. 


పనీర్‌ తురుములో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని చిన్న లడ్డులల చెయ్యాలి. పనీర్‌ ఉండలను పెట్టి ఒక టేబుల్‌ స్పూను నూనెలో దోరగా వేగించి పక్కన పెట్టాలి. తర్వాత మరో బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె పోసి వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర వేసి బాగా వేగించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి మరో 5 నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఆమ్‌చూర్‌ పొడి, ఉడికించిన గుడ్లను సగం కట్ వేసి చిన్న మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే పన్నీర్ ఎగ్ కర్రీ రెడీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: