ఆదివారం వచ్చింది అంటే చాలు ఇంట్లో నుండి చికెన్ వాసనా రావాల్సిందే. అయితే ఇప్పుడు కుదరదు లెండి. ఎందుకంటే చాలామంది కార్తీక మాసాన్ని ఫాలో అవుతున్నారు కదా అందుకే. అయినప్పటికీ కొంతమంది ఆహారప్రియులు ఉంటారు. నాన్ వెజ్ అంటే చాలు పడి చస్తారు. అయితే ఇంట్లో బిర్యానీ ఎలా చెయ్యాలో చాలామందికి తెలియాదు. అయితే అదిరిపోయే బిర్యానీని ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకొని.. ఇంట్లోనే రుచికరమైన హాట్ హాట్ బిరియాని చేసుకోండి. 


కావలసిన పదార్థాలు... 


చికెన్‌ - ఒక కిలో, 


బాస్మతి బియ్యం - ఒక కిలో, 


గరం మసాలా - రెండు టీ స్పూన్లు, 


అల్లం ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, 


నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, 


వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, 


పెరుగు - ఒక కప్పు, 


ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, 


పచ్చిమిరపకాయలు - ఐదు, 


ఎండు మిరపకాయలు - ఆరు, 


పసుపు - చిటికెడు, 


కొత్తిమీర - ఒక కట్ట, 


ఉప్పు - తగినంత, 


నూనె - సరిపడా.


తయారీ విధానం... 


ముందుగా తీసుకొచ్చిన చికెన్ ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టాలి. బియ్యాన్ని కడిగి ఆర బెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతులు నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి. స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా వేసి దానిపైన సగం ఉడికిన అన్నాన్ని వేయాలి. మళ్లీ ఒక పొర మిగతా చికెన్ ని వేయాలి. దానిపై మిగిలిన అన్నాన్ని వేసి మూతపెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలి. బాగా ఉడికించి దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: