పచ్చి పులుసు.. అప్పట్లో ఇంట్లో అమ్మవాళ్ళు చేసే వారు. కానీ ఇప్పుడు పచ్చి పులుసు చేసే వారే లేరు.. అలాంటిది మీకు చింతకాయ పచ్చి పులుసా ? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ చింతకాయ పచ్చి పులుసు..  ఎంత బాగుంటుంది అంటే అది చెప్పలేము.. తిని చూడాల్సిందే.. అందుకే ఎంత బాగుంటుంది అనేదానికి ఒకసారైనా తినాలి. అది ఎలానో ఇక్కడ చదివి తెలుసుకోండి. నోరు ఊరించే చింతకాయ పచ్చి పులుసు రుచి చుడండి..  


కావలసిన పదార్థాలు.. 


తెల్ల వంకాయ - 1, 


ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, 


చింతకాయ గుజ్జు - అర కప్పు, 


పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, 


బెల్లం - 2 టేబుల్‌ స్పూన్లు, 


కొత్తిమీర - అరకప్పు, 


నీరు - ఒకటిన్నర కప్పు, 


ఉప్పు - రుచికి తగినంత, 


తాలింపు కోసం: కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి రేకలు, ఎండుమిర్చి - సరిపడా.


తయారీ విధానం: 


వంకాయకి నూనె రాసి సెగమీద కాల్చి చల్లారనిచ్చి తొక్కతీసి గుజ్జుగా చేసుకోవాలి. ఒక పాత్రలో ఈ గుజ్జుతో పాటు, చింతకాయ గుజ్జు, బెల్లం, నీరు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బెల్లం కరిగేదాకా చేత్తో కలపాలి. తర్వాత కడాయిలో తాలింపు వేసి చింతకాయ గుజ్జు మిశ్రమంలో కలపాలి. ఈ పచ్చిపులుసు అన్నంతో చాలా బాగుంటుంది. చూశారుగా ఎలా చెయ్యాలో.. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి చింతకాయ పులుసు చేసేయండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: