శిశువు ఎదుగుదలకు, ఆరోగ్యానికీ తల్లిపాలే మంచివి. పాపాయి ఏడుస్తోందని, ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వకూడదు. పిల్లలకు ఏ అసౌకర్యం కలిగినా, తల్లికి ఆ విషయాన్ని తెలియచేసే భాష వారి ఏడుపు మాత్రమే. పాపాయి ఏడుపునకు కారణమేమిటో గమనించి, వారి అసౌకర్యాన్ని, ఇబ్బందినీ తొలగించాలి. పాపాయి ఆకలిని, జీర్ణశక్తిని బట్టిమూడు మూడున్నర గంటల కొకసారి తల్లి పాలు ఇవ్వాలి. ప్ర‌తిరోజూ న‌ల్ల‌ జీల‌క‌ర్ర చూర్ణ‌మును తుల‌ము తేనెలో క‌లిపి, రోజూ రెండు పూట‌లా ఇవ్వ‌డంతో చిన్న‌ప‌ల్ల‌ల్లో అజీర్ణ‌మును, నీరస‌మును నివారించ‌వ‌చ్చు. 


వేప‌నూనెతో ప‌సిపిల్ల‌ల శ‌రీరాన్ని మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల ఎముక‌లు గ‌ట్టిప‌ట్టి శ‌రీరం గ‌ట్టిప‌డుతుంది. రావిప‌ట్ట చూర్ణ‌మును తేనెలో క‌లిపి, నాలుక‌కు రాస్తే చిన్న పిల్ల‌ల నోటిపూత త‌గ్గుతుంది. తల‌సి ఆకుల‌ర‌సం ఒక చిన్న స్పూన్‌, తేనె చిన్న స్పూన్ క‌లిపి, రోజుకు మూడు సార్లు ప‌ట్టిస్తే జ‌లుబు ద‌గ్గు అనేది పిల్ల‌ల ద‌రిచేర‌దు.  ప‌సి పిల్ల‌ల‌కు చాలా మంది వ‌స ప‌డ‌తారు ఆ వ‌స‌ను సాన‌మీద అర‌గ‌దీసి తేనెలో క‌లిపి నాకిస్తే పిల్ల‌ల‌కు మాట‌లు చాలా త్వ‌రగా వ‌స్తాయి. ప్ర‌తిరోజూ రాత్రి ప‌డుకునే ముందు పావుసేరు పాల‌ల్లో చిటికెడు ఆవాలు పొడి వేసి తాగిస్తే చిన్న పిల్ల‌లు ప‌క్క‌లో మూత్ర‌ము పోయుట‌ను మానుకుంటారు. 
చేతులు, కాళ్ళు కడుక్కోవడం, చక్కగా స్నానం చేయడం, తినే ఆహార విషయాల్లో జాగ్రత్తపడడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, రోగాలతో బాధపడే వారికి  పిల్ల‌ల‌ను దూరంగా ఉంచ‌డం , లేదా తగిన జాగ్రత్తలతో వారి దగ్గరకు చేరడం లాంటి చర్యలు మన వ్యక్తిగత పారిశుద్ధ్యానికి ఉపయోగపడతాయి. మన గదులు, గోడలు, గూళ్ళు, కిటికీలు, వరండాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముంగిళ్ళలో ముగ్గులు పెట్టుకోవడం వల్ల పరిశుభ్రతతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉంటుంది. మలేరియా, నిమోనియా, ఫ్లూ జ్వరం, జలుబు, గజ్జి, కంటి జబ్బులు, పోలియో, నంజువ్యాధి, నోటిలోను పెదవుల చివర పుళ్ళు, నీళ్ళ విరేచనాలు, కోరింత దగ్గు, డిఫ్తీరియా, టైఫాయిడ్, గాయిటర్, అనీమియా లాంటి వ్యాధులు పిల్లలకి సోకటానికి ఎక్కువ అవకాశం ఉంది వీటితో చాలా జాగ్ర‌త్త‌గాఉండాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: