ఉసిరికాయా.. ఈ పేరు చెప్తేనే నోరు ఊరిపోతోంది. పుల్లాగా ఉన్న ఈ ఉసిరికాయ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ ఉసిరికాయ వల్ల జుట్టు నిగనిగలాడుతూ నల్లగా వత్తుగా పెరుగుతుంది. అయితే ఇంకా వంట గురించి వస్తే.. ఉసిరికాయ పప్పు, ఉసిరికాయా ఊరగాయ మనం తినుంటాం. అమ్మమ్మ, నానమ్మ ఉన్నవాళ్లు అయితే ఉసిరికాయ పచ్చడి కూడా తినుంటారు. కానీ ఇప్పుడు వాళ్లకు అది తినాలి అని ఉన్న ఎలా చేసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళు ఉసిరికాయ పచ్చడి ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


కావలసిన పదార్థాలు..


ఉసిరికాయలు - ఒక కప్పు, 


నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, 


సోంపు - ఒక టేబుల్‌ స్పూన్‌, 


ధనియాల పొడి - ఒక టీ స్పూన్‌,


కారం - ఒక టీ స్పూన్‌, 


నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌, 


ఉప్పు - తగినంత.


తయారీ విధానం.. 


ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సోంపు వేసి బాగా వేగించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలును విత్తనాలు తీసి వేయాలి. ధనియాల పొడి, కారం, నెయ్యి వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి. తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే నోరు ఊరించే ఉసిరికాయా పచ్చడి ఇవ్వాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: