సాధార‌ణంగా పెళ్లి అయిన వెంటనే ప్రతి ఒక్కరూ గర్భం రావాలని కోరుకుంటారు. కొంద‌రు వెంట‌నే క‌న‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. లైఫ్‌లో సెటిల్ అయ్యాక పిల్ల‌ల‌ను క‌న‌డానికి ఇష్ట‌ప‌డతారు. ఈ క్ర‌మంలోనే ఏవేవో గర్భనిరోధక మాత్రలను వాడేస్తుంటారు. అయితే స‌రిగ్గా పిల్ల‌లు కావాల‌నుకునే టైమ్‌లో అది వీలుకాక బాధ‌ప‌డుతుంటారు.  దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు. కానీ.. కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో అయితే గర్భం దాల్చడం చాలా సులభమంటున్నారు నిపుణులు.


అయితే త్వరగా గర్భం రావాలంటే చాలా రకాల పద్ధతులను భార్యాభర్తలు పాటించాలి. కేవలం సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుందనుకోవడం పొరపాటు. సెక్స్ లో ఏ సమయంలో పాల్గొనాలి, ఎలా పాల్గొనాలి అనే అంశాలపై కూడా అవగాహన ఉంటేనే అమ్మాయికి గర్భం వస్తుంది. మ‌రియు దంపతులు చేసే కొన్ని చిన్ని చిన్న పొరపాట్ల కారణంగా గర్భం రావడం ఆలస్యం అవుతుందంటున్నారు నిపుణులు. చాలా మంది కుటుంబనియంత్రణ మందులు వాడుతుంటాయి.


అయితే పిల్లలు కావాలి అనుకుంటే మాత్రం కొన్ని నెలలకు ముందుగానే వాటిని వాడటం ఆపేయాలి. స్త్రీలు సంభోగమైన వెంటనే వేడినీళ్లతో స్నానం చేయరాదు. ఆలా చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగి, గర్బం ధరించే అవకాశాలు తగ్గవచ్చు. పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్లీ స్త్రీలో అండం తయారైన సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం దాల్చడం చాలా సుల‌భంగా మారుతుంది. మద్యం లేదా స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే ముందుగానే మానేయాలి. ఈ అలవాటు ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉన్నా కూడా గ‌ర్భం దాల్చే అవ‌కాశం త‌గ్గుతుంది. వీటితో పాటు భార్య భర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: