కావాల్సిన ప‌దార్థాలు:
బాస్మతీబియ్యం- ఒక కేజి
స్వీట్ కార్న్‌- రెండు కప్పులు
గరంమసాలా- ఇక టేబుల్‌స్పూన్‌
ఉల్లిపాయ తరుగు- ఒక కప్పు


జీలకర్ర- అర స్పూను
నూనె- సరిపడా
క్యాప్సికమ్‌- ఒక‌ కప్పు
అల్లం- ఒక‌ స్పూను


పచ్చిమిర్చి- ఐదు
వెల్లుల్లిపేస్ట్‌- ఒక‌ స్పూను
బంగాళదుంప- ఒక కప్పు
పసుపు - అర స్పూను


తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకొని నూనె వేసి ఉల్లిపాయలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌ తీసుకొని అందులో నానపెట్టుకుని ఉంచుకున్న బియ్యం, బంగాళదుంప, స్వీట్‌ కార్న్‌ వేయాలి. అలాగే కొద్దిగా నూనె, సరిపడా నీళ్ళు పోసి మిక్స్‌ చేసి మూత పెట్టి మూడు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఇప్ప‌డు స్టౌ ఆఫ్‌ చేసి కుక్కర్‌ లోని ఆవిరి మొత్తం తగ్గనివ్వాలి.


మరో పాన్‌ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేసి.. వేడి అయ్యాక‌ అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, అల్లం, గరం మసాలా, మరియు పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత స్వీట్‌ కార్న్‌ రైస్‌ ను బయటకు తీసి పాన్‌ లో వేగుతున్న మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని క కలుపుకోవాలి. అంతే ఎంతో సులువుగా స్వీట్‌ కార్న్‌ రైస్ రెడీ.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!


మరింత సమాచారం తెలుసుకోండి: