మాంసం ప్రియులు.. చికెన్ ఇలా చేసుకోవాలి.. ఆలా చేసుకోవాలి.. కొత్త కొత్తగా చికెన్ ని ట్రై చెయ్యాలి అని అనుకుంటుంటారు. ఒకరోజు చికెన్ ఫ్రై చేస్తే మరో రోజు చికెన్ కర్రీ చేసుకుంటారు. అయితే చికెన్ పికిల్ మాత్రం చాలావరకు తిని ఉండరు. ఒకవేళ తిన్నారు అంటే.. ఇంకా చికెన్ పికిల్ ని వదలరు. చికెన్ పై అంత ప్రేమ పెంచుకుంటారు మరి. అయితే అంత ప్రేమ ఉన్న చికెన్ పికిల్ దాదాపు ఎక్కడ దొరకదు. అలాంటి చికెన్ పికిల్ చేసుకోవాలి అంటే రాదు. వారికోసమే ఇక్కడ చికెన్ పికిల్ రెసిపీ.. ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.  


కావాల్సిన పదార్థాలు.. 


చికెన్‌ - కిలో, 


అల్లం పేస్ట్‌ - 50 గ్రాములు, 


వెల్లుల్లి పేస్ట్‌ - 50 గ్రాములు, 


కారం - 100 గ్రాములు, 


పసుపు - 5 గ్రాములు, 


ఆవనూనె - 800 మి.లీటర్లు, 


ఇంగువ - 2 గ్రాములు, 


ఉల్లి ముక్కలు - 200 గ్రాములు, 


యాలకుల పొడి - 5 గ్రాములు, 


సోంపు - 20 గ్రాములు, 


నల్ల జీలకర్ర - 10 గ్రాములు, 


మెంతులు - 5 గ్రాములు, 


ఆవాలు - 10 గ్రా, 


వెనిగర్‌ - 400 మి.లీటర్లు


తయారీ విధానం.. చికెన్‌ ముక్కలకు కారం, పసుపు, ఉప్పు పట్టించాలి. అల్లం, వెల్లుల్లి ముద్దల్లో సగం తీసుకుని చికెన్‌లో కలిపి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత గిన్నెలో నూనె వేసి బాగా వేడయ్యాక చికెన్‌ వేసి 2 - 3 నిమిషాల పాటు వేయించి తీసేయాలి. అదే నూనెలో ఇంగువ, ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. మిగిలిన మసాలాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి నిమిషంపాటు వేగించాలి. తర్వాత వెనిగర్‌ వేసి తెర్లనివ్వాలి. తర్వాత చికెన్‌ వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు వేగించి స్టవ్‌ ఆపేయాలి. ఆతర్వాత పికిల్‌ బాగా పూర్తిగా చల్లారాక జాడీలో నిల్వ చేసుకోవాలి. అంతే రెసిపీ రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: