ఎవరైనా మన వద్దకు బిక్షాటనకి వస్తే పాపం అనుకుంటూ వారికి ఎంతో కొంత డబ్బులిచ్చి సాయం చేస్తాం. అదే చిన్నపిల్లలు బిక్షం వేయండి అని వస్తే 'పాపం వాళ్ళు సరిగా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో' అనుకుంటూ కొంచెం ఎక్కువగానే డబ్బులిస్తాం. మనసులో వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. కానీ ఒక 60 ఏళ్ల పెద్దాయన బిక్షం అడిగిన ఒక అభం శుభం తెలియని చిన్నారిని సిగ్గు శరం లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి ముద్దుపెట్టుకున్నాడు. 10 రూపాయలు కాగితం ఇస్తూ ఆ బాలికను తాక రాని చోట తాకాడు. దాంతో భయబ్రాంతులకు గురైన ఆ చిన్నారి ఏడిచింది. ఇది గమనించిన అక్కడి ప్రజలు ఆ కామాంధుడి చొక్కా కాలర్ పట్టుకొని నిలదీశారు. 
ఈ సంఘటన దేశ రాజధాని అయినా ఢిల్లీ లోని పార్లమెంట్ కి దగ్గర ఉన్న కన్నాట్ ప్లేస్‌(సీపీ) లో చోటుచేసుకుంది. సీపీ మెట్రో స్టేషన్‌కు వెళ్లే దారిలో బిక్షాటన చేస్తున్న ఆరేళ్ల చిన్నారితో 60 ఏళ్ల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కొన్ని రోజుల క్రితం ఓ వీడియోను పోస్టుచేశాడు. 
పోస్ట్ చేసిన వ్యక్తి వీడియో డిస్క్రిప్షన్ లో.. "ఈ వీడియో లో ఉన్న వ్యక్తకి 60 సంవత్సరాలు. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి మెట్రో స్టేషన్ నుంచి వెళ్తుంటే అతనిని చూసాను. అప్పుడు ఈ 60 ఏళ్ల ముసలాయన బిక్షాటన చేసే ఒక చిన్నారిని బలవంతంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ బాలిక ప్రైవేటు పార్ట్ ను కూడా పట్టుకొన్నాడు. దీంతో ఆ అమ్మాయి ఏడిచింది. వెంటనే నేను వెళ్లి అతన్ని పట్టుకొని పోలీస్ కి అప్పగించాను."
"పాపం ఆ అమ్మాయి పేదది. తన తల్లిదండ్రులు ఫస్టు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) ఇవ్వలేరు. అందుకే నేను ఆ చిన్నారికి న్యాయం చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళొచ్చాను. 'అన్నయ్య.. రక్షించు.. ' అని ఆ చిన్నారి ఏడవడం నా జీవితంలోనే అత్యంత విషాదకరమైన సంఘటన." అని రాసాడు.
ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసారు. ఆ 60 ఏళ్ల కామాంధుడు ఆ చిన్నారిని తన కూతురిగా భావించి ముద్దుపెట్టుకున్న... కామంతో ఏమి పెట్టుకోలేదు.. కావాలంటే చూడండి అంటూ తన ప్యాంటు జిప్పు ని తీయబోతే అక్కడే ఉన్న పోలీస్ చంప చెళ్లుమనిపించాడు. ఢిల్లీ లో ఇలాంటి సంఘటనలు రోజుకి ఎన్నో జరుగుతాయి కానీ బయటకి వచ్చేది ఒకటో రెండో.


మరింత సమాచారం తెలుసుకోండి: