యూత్లో కోరికలు ఎక్కువగానే కలుగుతున్నాయి. అయితే, వాటికోసం శృంగారంలో పాల్గొనాలని చాలా మంది అనుకుంటారు. సినిమాలను చూసి  అలాగే తాము  చేయగలమని భావించి చేస్తుంటారు. అయితే అలాంటి క్రమంలో సరైన పద్ధతుల్లో చేయకపోగా అన్ని రోగాలను కొని తెచ్చుకుంటారు. ఆలా చేయడం వల్ల మొగ్గలోనే యుక్తవయసును నాశనం చేసుకుంటారు. అందుకే శృంగారానికి వెళ్లే ముందు వీటిని తప్పక వాడాలని చూసేస్తున్నారు. 


అసలు మ్యాటర్లోకి వస్తే.. ఈ మధ్య ఎక్కువగా వినిపించే మాట.. భయంకరమైన వ్యాధి అదే ఎయిడ్స్ ఎక్కువగా వినపడుతుంది. దేశంలో 19 రాష్ట్రాల్లో సేఫ్టిల వాడకం బాగా తగ్గిపోయిందట.2000లో సురక్షిత శృంగారం కోసం 38 శాతం మండి కండోమ్‌లు వాడుతుంటే ఇప్పుడు 2018 నాటికి అది కేవలం 24 శాతానికి పడిపోయిందట. సంతృప్తిగా ఉండటంలేదని పురుషులు వాడట్లేదు. దాని వల్ల చాలా మంది అరక్షిత లైంగిక సంబంధిత వ్యాధులతో భాదపడుతున్నారు. 


ఇంకా థ్రిల్ ఇవ్వని సేఫ్టిల కంటే గర్భనిరోధక మాత్రలు, కాపర్ టీ ఇంజెక్షన్లు ఎక్కువుగా వాడుతున్నారు. భావప్రాప్తిలో పురుషులు అస్సలు రాజీ పడట్లేదని ఆ ఆ అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ పనులు సమాజానికి పెను ప్రమాదం లాంటివని తెలుస్తోంది. వాటిని వాడకుండా అసురక్షితమైన శృంగారం చేస్తే ఆ భాగస్వామికి ఎయిడ్స్ లేదా ఇతర లైంగిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.


ఎయిడ్స్ వ్యాధి సోకితే జీవితం ముగిసినట్లే. ప్రస్తుతం సేఫ్టీ  వాడకపోవడం ద్వారా ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది. అంతేగాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతంలో రోజు రోజుకు ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సో మిత్రుల్లారా శృంగారం అనేది ఉప్పూకారం తింటున్న ప్రతి మనుషుల్లో వస్తాయి. అందుకే సేఫ్టిలు వాడండి. మీ జీవితాన్ని మీరే కాపాడుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: