అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ.. మానసికంగా హింసిస్తూ.. హర్రస్మెంట్ చేస్తున్న ఓ ఆకతాయి ఆటకట్టించారు విశాఖ పోలీసులు. అమాయక యువతుల్ని టార్గెట్ చేసుకొని అమ్మాయి పేరుతో చలామణి అవుతున్నాడు ఈ పేస్ బుక్ డాక్టర్‌... ఎంతోమందిని నమ్మించి మోసం చేశాడు. యువతులను ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తూ.. డబ్బు, బంగారం వసూలు చేశాడు. చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అతడు చెప్పిన విషయాలతో... పోలీసులే బిత్తరపోయారు.


వివరాల్లోకి వెళితే... విశాఖ కంచరపాలెంకు చెందిన కుమార్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిన కుమార్ సోషల్ మీడియాలో అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. మరికొందరు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కుమార్ ఫేస్‌బుక్‌‌లో ఫేక్ అకౌంట్ తెరిచి  తప్పుడు వివరాలతో తనను తాను ఓ డాక్టరుగా పరిచయం చేసుకున్నాడు. ఇలా అమాయకులైన అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు ఆ కేటుగాడు. అతడి మాయ మాటలు నమ్మిన చాలామంది యువతులు అతడిని కలిశారు.


అలా తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలతో కుమార్ సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసేవాడు. ఈ వీడియోలు చూపించి బెదిరించి.. వారి దగ్గర నుంచి డబ్బు, బంగారం లాక్కునేవాడు. ఇలా అతడి ట్రాప్‌లో చాలామంది యువతులు పడి మోసపోయారు. చాలామంది పరువు పోతుందని ఈ విషయాన్ని బయటపెట్టలేదు. 


కానీ ఓ బాధితురాలు మాత్రం ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పక్కాగా స్కెచ్ వేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో కుమార్ చెప్పిన నిజాలతో పోలీసులే షాక్ తిన్నారు. ఫేస్‌బుక్ మాయలో పడి యువతులు అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటి జరగవలసిన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: