కావాల్సిన ప‌దార్థాలు:
సన్న బియ్యం- ఒక‌ కప్పు
మెంతికూర- ఒక కట్ట
ఉడికిన ఆలూ ముక్కలు- అరకప్పు
మిరియాలపొడి- అరచెంచా


గరంమసాలా- అరచెంచా
బిర్యానీ ఆకులు- రెండు
దాల్చిన చెక్క- 2 అంగుళాలు
లవంగాలు- 4


నెయ్యి- రెండు చెంచాలు
జీరా- అరచెంచా
ఉప్పు- తగినంత


ఉల్లిపాయలు-ఒక క‌ప్పు
పచ్చిమిర్చి- రెండు
యాలకులు- మూడు


తయారీ విధానం: 
మెంతి ఆకును శుభ్రం చేసి స‌న్న‌గా త‌రిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి వేడిచేసి అందులో జీల‌క‌ర్ర, దాల్చిన‌చెక్క‌, ల‌వంగాలు, బిర్యానీఆకులు, యాల‌కులు దోర‌గా వేయించి అందులో ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి మ‌రో ఐదు నిమిషాలు వేయించాలి. ఆ త‌ర్వాత ఉడికించిన ఆలూ ముక్క‌లు, మెంతి కూర వేసి క‌లిపి స్లో ఫ్లేమ్ మీద ప‌చ్చివాస‌న పోయే వ‌ర‌కు వేయించారు.


ఆ త‌ర్వాత క‌డిగి వార్చి పెట్టుకొన్న బియ్యాన్ని కూడా ఈ మిశ్ర‌మంలో వేసి క‌లిపి రెండు నిమిషాల త‌ర్వాత త‌గినంత ఉప్పు, గ‌రంమ‌సాలా, మిరియాల‌పొడి వేసి రెండు క‌ప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మంట‌ త‌గ్గించి ఉంచాలి. బియ్యం బాగా ఉడికిన త‌ర్వాత స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే మెంతికూర పలావ్ రెడీ. దీన్ని ఏదైనా కూర్మాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: