ఆహారం విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు పాటించాలి. తగిన పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యానికి సమతులాహారమే కీలకమనే విషయం మరచిపోవద్దు. ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలు, మాంసం తదితర పదార్థాలు తగిన మోతాదులో తీసుకోవాలి. తనకు, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యం చేకూర్చేవి ఇవే. బిడ్డ తగిన బరువుతో పుట్టాలంటే ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అలాగే గర్భిణులు సమతులాహారం తీసుకోవడం వల్ల కాన్పు సమయంలో, ఆ తర్వాత అత్యవసర ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు.


సాధారణంగా తీసుకునే ఆహారం కంటే గర్భిణులు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని ఒక్కసారే అధిక మోతాదులో కాకుండా కొద్దికొద్దిగా తీసుకోవాలి. కాల్షియం, ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితోపాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, కోడిగుడ్లు, చేపలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. మలబద్ధకం లేకుండా ఎక్కువ ద్రవ, పీచు పదార్థాలు తీసుకోవాలి.


సరైన పోషకాహారంతో పాటు తగిన విశ్రాంతి తీసుకోవాలి. పగలు కనీసం 2 గంటలు, రాత్రి 8 గంటలు నిద్రపోవాలి. గర్భిణులకు సహజంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వల్ల బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, అధిక రక్తస్రావం కావడం లాంటివి సంభవిస్తాయి. ఐరన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన కర్జూరం, ద్రాక్ష, నువ్వులు, చెరకు రసం, ఉలవలు, కాలేయం తీసుకోవాలి. రోజూ ఒకటి చొప్పున ఐరన్‌ మాత్రలు వేసుకోవాలి (డాక్టర్‌ సలహా మేరకు). పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండే వారికి సుఖ ప్రసవం జరగుతుంది.


సరిగా ఉడకని మాంసం తీసుకోవద్దు. దీని వల్ల ఒకరకమైన ఇన్‌ఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీస్తుంది. లేదా దృష్టిలోపంతో బిడ్డ జన్మించొచ్చు. కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు తినొద్దు . దీనివల ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. అబార్షన్‌ కావడానికి ఆస్కారం ఉంటుంది. .
తొలి నెలల్లో ఆవకాయ, మామిడికాయ, ఆవపెట్టిన కూరలు, నువ్వులు, బొప్పాయి వంటివి తీసుకోకూడదు. పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్థాలు తీసుకోవద్దు. పచ్చి గుడ్డులో అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల టైఫాయిడ్‌లాంటి వ్యాధులు రావచ్చు.


మొదటి మూడు మాసాల్లో కెఫిన్‌ పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు. రోజుకు 200 మి.గ్రాముల కంటే ఎక్కువగా కెఫిన్‌ తీసుకుంటే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంది. కెఫిన్‌ డైయూరిటిక్‌గా పనిచేస్తుంది. వంటిలోని నీరును బయటికి పంపివేయడం వల్ల డీహైడ్రేషన్‌ రావచ్చు. దీంతో గర్భస్రావం కావచ్చు.
కూరగాయలు, పండ్లు బాగా కడిగి తినాలి. కడగని కూరగాయలు, పండ్లపై హాని కలుగజేసే బాక్టీరియా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. బొప్పాయి తినడం వల్ల గర్భస్రావమవుతుందనడం ఎంత మాత్రం నిజం కాదు. ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. తద్వారా విరేచనాలు, బహిష్టు స్రావం కలగవచ్చు. ఇది చాలా బలహీనంగా ఉన్న వారిలో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.


గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగితే మంచిది కాదంటారు. ఇదీ అవాస్తవమే. కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇందులో ఎక్కువ మోతాదులో పొటాషియంం లవణాలు ఉంటాయి. అందుకే ఎక్కువ తాగితే జలుబు చేసి కఫం రావచ్చు. అంతే కానీ కొబ్బరి నీళ్లు తాగితే జలుబురాదు.
మాంసాహారంలో ఎక్కువ ప్రోటీన్స్‌ ఉంటాయి. మాంసం తినడం వల్ల శరీరం దృఢంగానూ, బలంగానూ తయారవుతుంది. శాకాహారం కన్నా మాంసాహారం కొంతవరకు మేలే.


గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు. ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి త్వరగా జీర్ణం కాదు. అందు వల్ల అధికంగా తినకపోవడమే మంచిది. గర్భిణులు మొత్తం ఉడక బెట్టిన గుడ్లు తినాలి. బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల గర్భిణులకు బీట్‌రూట్‌ కన్నా క్యారెట్‌ కొంత వరకు మంచిదే.


మరింత సమాచారం తెలుసుకోండి: