మహిళలు మామూలు సమయాల్లో కంటే గర్భిణిగా ఉన్న సమయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ మంది గర్భిణీ గా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే 9 నెలలు నిండే వరకు కూడా రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తుంటారు. ఒకప్పుడైతే మహిళ గర్భం తో ఉంది అంటే మొదటి నెల నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటు ఇంటిపట్టునే ఉండేవారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ  ఉన్నప్పటికీ కూడా మహిళలు పురుషులకు పోటీగా  ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. నేటి సమాజంలో మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు ఉద్యోగానికి వెళ్లే మహిళలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు సహా రోజు రోజుకి అలసట ఎక్కువ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తడం వల్ల... మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో  జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 

 

 

 

 గర్భవతిగా ఉన్న మహిళలు అసౌకర్యాన్ని ఎలా అధిగమించాలో వారికోసం కొన్ని చిట్కాలు. గర్భవతిగా ఉన్న మహిళలకు ఎక్కువగా వికారంగా ఉంటుంది వాళ్లకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవాలన్న వికారంగానే ఉంటుంది.  ఎక్కువ మొత్తంలో వాంతులు అవుతూ ఉండటం వల్ల తొందరగా నీరసంగా మారిపోతుంటారు. అయితే మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు వికారంగా ఉంటే చిరుతిళ్లు ఎక్కువ తినమని నిపుణులు సూచిస్తున్నారు. బిస్కెట్లు క్రాకర్ లాంటివి తినడంతో పాటు ఉద్యోగం చేసే మహిళలు తమ ముందే కొన్ని ప్రోటీన్లు ఇచ్చే ధాన్యాలు పప్పులు  పెట్టుకుని తింటూ ఉంటే  నీరసం రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ తాగటం ద్వారా  కూడా వికారాన్ని తగ్గిస్తుందట . అంతేకాకుండా గర్భవతిగా ఉన్న సమయంలో తొందరగా మహిళలకు అలసట వచ్చేస్తుంది. ఐరన్ లోపం లేదా రక్తపోటు వల్ల ఇలా అలసట వచ్చేస్తుంది ఇలాంటప్పుడు ఎక్కువగా ఐరన్ ప్రోటీన్లు ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి అంతేకాకుండా సీ ఫుడ్ తో  పాటు పలు ప్రోటీన్లు ఇచ్చే  ధాన్యాలను కూడా తింటూ ఉండాలి. అంతేకాకుండా ఊరికే కూర్చోకుండా అటు ఇటు తిరగడం కళ్లు మూసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవడం... కాళ్ళని  కాస్త పైన లేపి  పెట్టడం ద్వారా కూడా అలసట తగ్గుతుంది. 

 

 

 

 గర్భవతిగా ఉన్న మహిళలు ఎక్కువగా ద్రవ పదార్థాలు   తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా వాటర్ తాగడం కొబ్బరి నీళ్లు తాగడం వంటివి చేయాలని చెబుతున్నారు. అయితే మహిళలు కాస్త వ్యాయామం చేయడం కూడా మంచిది ఎందుకంటే రోజంతా ఆఫీసులో కూర్చుని ఉండడం వలన కూడా అలసట పెరిగిపోతూ ఉంటుంది... దీంతో  ఆఫీస్ అయిపోయిన తర్వాత నడవడం లాంటివి చేస్తే  కాస్త శక్తి చేకూరుతుంది. అయితే గర్భవతిగా ఉన్న మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం మామూలు సమయాల్లో 8 గంటలు నిద్రపోతే గర్భవతిగా ఉన్నప్పుడు 10 గంటలు నిద్ర పోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా మహిళలు పడుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. అంతేకాకుండా గర్భవతులు కూర్చునేటప్పుడు ఎక్కువగా అడ్జస్ట్ ఫుల్ గా ఉన్న కుర్చీలల్లోమాత్రమే కూర్చోవడం మంచిది. 

 

 

 

 ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాల్లో  మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడిని  కాస్త కంట్రోల్ లో పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు ప్రయానాలు  కూడా తక్కువ చేయాలంటూ డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక గర్భవతులు చెడు పదార్థాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం వైద్యులు సూచించిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటే మంచిది. డాక్టర్ను సంప్రదించడం ద్వారా మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తల్లికి బిడ్డకు మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: