కావాల్సిన ప‌దార్థాలు:
బాస్మతి రైస్‌- ఒక‌కిలో
పాలక్ ప్యూరీ- ఒక‌ కప్పు
మిరియాల పొడి- అరచెంచా


సోయాసాస్- అర టీ స్పూన్ 
పచ్చి బఠానీ గింజలు- గుప్పెడు 
ఉప్పు- రుచికి తగినంత
నూనె- త‌గినంత‌ 


ఉల్లిపాయ- ఒక‌టి
క్యారెట్- ఒక‌టి
పచ్చిమిర్చి- మూడు
కొత్తిమీర‌- కొద్దిగా


తయారీ విధారం: 
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకొని నూనె వేసి కొద్దిగా వేడి కాగానే ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్, బఠానీలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి. ఈ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పాలక్ ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి, సోయాసాస్ వేసి కలిపి మూతపెట్టి కొన్ని నిమిషాల పాటు మ‌గ్గ‌నివ్వాలి. 


ఇప్పుడు అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఎసరు మరుగుతుండగా కడిగిపెట్టుకొన్న బియ్యం వేసి స్లో ఫ్లేమ్ మీద‌ మూతపెట్టి ఉడికించాలి. ఇప్పుడు రైస్ తగినంత ఉడికిన త‌ర్వాత చివిరిలో కొత్తిమీర జ‌ల్లి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ పాలక్ రైస్ రెడీ. దీన్ని రైతాతో వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: