స్త్రీకి ప్రసవం రెండో జన్మ అంటుంటారు. కానీ ఈరోజుల్లో దేనికైనా వైద్య సదుపాయాలు అందబాటులో ఉన్నాయి. కాబట్టి అంత డేంజర్ లేదు. కానీ ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు గర్భిణులను ఇబ్బందిపెడుతున్నాయి. కొందరిలో అంతా బావున్నా శిశివు చనిపోయి పుడుతుంటాడు. చివరి నెలలో రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ రావటం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది.

 

అలాంటి వారు ఇప్పుడు మరోసారి సంతానాన్ని కనొచ్చా.. అలాంటి వారు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.. తెలుసుకుందాం.. మామూలు కాన్పే అయినా పిల్లాడు చనిపోయి పుట్టడానికి రకరకాల కారణాలు దోహదం చేసి ఉండొచ్చు. అవేంటన్నది క్షుణ్నంగా పరిశీలించటం అత్యవసరం.

 

అరుదే అయినా గర్భస్థ శిశువుల్లో కొందరికి పుట్టుకతోనే జీవక్రియల్లో తేడాలు ఉంటుంటాయి. ఇలాంటివి గలవారిలో కొన్ని ఎంజైమ్‌లు లోపిస్తాయి. ఇలాంటి కారణాలు పిండం మీద దుష్ప్రభావం చూపే అవకాశముంది. కొన్నిరకాల జన్యు సమస్యలూ విపరీత ప్రభావం చూపొచ్చు. ఈ సమస్యలు మున్ముందు గర్భం ధరించినా తిరిగి తలెత్తే అవకాశం ఉంది.

 

అందువల్ల రెండోసారి గర్భం ధరించాలంటే గైనకాలజిస్టును, శిశు నిపుణులను సంప్రదించడం మంచిది. అవసరమైన అన్ని పరీక్షలు చేయించుకోవాలి. తొలిసారి గర్భం ధరించినప్పుడు, కాన్పు సమయంలో చేసిన చికిత్సల వివరాలన్నీ వైద్యులకు పూర్తిగా తెలియజేయాలి. ఆ తర్వాతే గర్భధారణకు ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: