బీరకాయ పులుసు.. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు. మామూలుగానే బీరకాయ కూర అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాంటిది కోడిగుడ్డు బీరకాయ కూర అంటే ఇంకా ఎంత రుచిగా ఉంటుందో చుడండి. అయితే ఇంట్లో అంటే బీరకాయ కోడిగుడ్ల కూర చేసి మనకు పెడుతారు.. కానీ బయటకు వచ్చాక ఆ కూర ఎలా చెయ్యాలి అనేది అంత ఈజీగా మనకు తెలియదు. రాదు కూడా. అలాంటి వారు ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకుంటే సరిపోతుంది.. 

 

కావలసిన పదార్ధాలు.. 

 

ఉడికించిన కోడిగుడ్లు - నాలుగు, 


ఉల్లి తరుగు - ముప్పావుకప్పు, 


లేత బీరకాయ ముక్కలు - రెండు కప్పులు, 


కరివేపాకు రెమ్మ - ఒకటి, 


పచ్చిమిర్చి నిలువుగా చీల్చి - ఒకటి, 


ఆవాలు - పావు టీస్పూన్‌, 


జీలకర్ర - అర టీస్పూన్‌, 


అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌, 


పసుపు - కొంచెం, 


ఉప్పు - రుచికి సరిపడా, 


కారం, గరం మసాలా పొడి - ఒక్కో టీస్పూన్‌ చొప్పున, 


నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు.

 

తయారీ విధానం ..  పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అవి వేగిన తర్వాత ఉల్లి తరుగు వేసి ఉప్పు చల్లి ఉల్లి ముక్కలు రంగుమారేవరకు ఉంచాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. ఇందులో గుడ్లు వేసి రెండు నిమిషాలు వేగించి తీసి పక్కన పెట్టాలి. తరువాత బీరకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేయాలి. మంట పెంచి మూడు నిమిషాలు బాగా వేగించాలి. మూతపెట్టి సన్నటి మంట మీద బీరకాయ ముక్కల్ని ఉడికించాలి. అవసరమనిపిస్తే కొన్ని నీళ్లు కలపాలి. తర్వాత ఇందులో వేగించిన గుడ్లు, కారం, మసాలాలు వేసి బాగా కలిపి సన్నటి మంట మీద ఏడు నిమిషాలు ఉంచాలి. అంతే కోడి గుడ్ల కూర రెడీ అయిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: