ప్ర‌తి మ‌నిషి జీవితంలోనూ శృంగార బంధం అనేది ఒక‌టి ఉంటుంది. పెళ్ళి త‌ర్వాత కొంద‌రు భార్య‌లు శృంగారం మీద ఎక్కువ‌గా ఆశ‌క్తిని చూప‌రు. అలాంటి స‌మ‌యాల్లో  భాగస్వామితో శృంగార సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు ఎలాంటి ప్లాన్ లు వేస్తారంటే చాలా మంది ఇలా సమాధానాలు చెప్పారని ఓ సర్వేలో వెల్లడైంది. హనీమూన్ కు వెళ్లడం, మంచి దుస్తులతో ఆకర్షించడం, సరైన మేకప్ వేసుకోవడం మరియు శారీరక రూపాన్ని మెరుగుపరచుకోవడం వంటి విషయాలను చెప్పారట. ఈ విషయాలన్నీ శృంగార ఆకర్షణకు కొంతవరకు సహాయపడతాయి. కానీ వీటితో పాటు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి.

 

 వీటి వల్ల కూడా మీకు మరియు మీ భాగస్వామికి మధ్య శృంగార సంబంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. కొన్నిసార్లు మీరు మాట్లాడే విధానం, మీ వ్యక్తిత్వం, మీ పని విధానం వంటివి కొన్నిసార్లు మీ భాగస్వామి మధ్య దూరం పెంచుతుంది అని కూడా రుజువైంది. దీని వల్ల శృంగారం పట్ల ఆకర్షణ తగ్గుతుందట‌. అలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలను గ‌మ‌నిద్దాం...

 

శృంగార ఆకర్షణ.. విశ్వాసం, నిజం అనేవి వ్యక్తి యొక్క రెండు మంచి లక్షణాలు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ లక్షణాలను మరచిపోకూడదు. మీ భాగస్వామిపై నమ్మకం మీ సంబంధాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలో మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే విశ్వాసం చూపండి. ఇలాంటివి మీ శృంగార బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అలాగే మీ శృంగార ఆకర్షణను కూడా పెంచుతుంది. 

 

మీరు చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన ఒకరి దృష్టిని ఆకర్షించలేరు. హాస్యం లేదా జోక్స్ అనే ఉపాయం ఎల్లప్పుడూ పని చేయదు. శృంగార విషయంలో సున్నితంగా.. మీరు మీ భాగస్వామితో తెలివిగా ప్రవర్తించడం వంటివి చేస్తే మీ శృంగార ఆకర్షణ చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మీ స్వభావం అయితే మీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వొచ్చు. 

 

ఆకర్షణీయమైన స్వరం.. ఈ రోజుల్లో చాలా సంబంధాలు ఫోన్లలో వాయిస్ వల్ల విచ్ఛిన్నమవుతున్నాయి. అందుకే వాయిస్ మంచిది కాకపోతే మీ రిలేషన్ పట్ల ఎంతటి ప్రతికూల ప్రభావం ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఇదే అంశంపై జర్నల్ సర్వేలో సెక్సీ, హస్కీ, లోతైన మరియు ఉత్సాహంతో ఎవరినైనా ఆకర్షించవచ్చని వెల్లడించారు. ఆకర్షణీయమైన స్వరం కూడా ఫేస్ టు ఫేస్ సమావేశంలో మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటుంది ఉదయాన్నే మీరు గార్గ్లింగ్ చేయండి. ఇది మీ స్వరాన్ని సెక్సీగా మార్చడానికి చాలా సహాయపడుతుంది. 

 

మేకప్ తో మెరుగులు.. మీరు మీ భాగస్వామితో శృంగార క్షణాలను ఎక్కువగా పొందాలను మీ ముఖానికి సంబంధించి మేకప్ ను పెంచాలి. దీని వల్ల మీ భాగస్వామి ఆకర్షితులు అవుతారు. అయినా కూడా సాధారణ రూపాన్ని కలిగి ఉంటే అలాంటి వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు.  పురుషులు గడ్డం స్టైలిష్ గా చేయగలిగినట్లయితే, మహిళలే మంచి మేకప్ వేయడం ద్వారా వారు తమను తాము మెరుగ్గా ప్రదర్శించుకోగలరు. ఇలా ఇన్ని విధాలుగా మీలో పాజిటివ్‌నెస్ క‌నిపిస్తే ఏదైనా సుల‌భంగా సాధ్య‌మవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: