పుట్టగొడుగులు.. శాకాహారులకు ఇదే మాంసం. ఈ పుట్టగొడుగులతో కూర వండిన, బిర్యానీ చేసిన, ఫ్రైడ్ రైస్ చేసిన అదిరిపోతుంది. అయితే హోటల్ లో అప్పుడప్పుడు పుట్టగొడుల ఫ్రీ తిని ఉంటాము.. కానీ ఎలా చేసుకోవాలో తెలీదు. అలాంటివారు ఈ పుట్టగొడుగుల రెసిపీ చేసుకొని తినండి. ఆహా ఏమి రుచి అని అంటారు.. ఆ పుట్టగొడుగుల ఫ్రై రెసిపీ ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్దాలు..  

 

పుట్టగొడుగులు - పావుకేజీ, 


జీడిపప్పు - పది, 


ఉల్లిపాయ - ఒకటి, 


టమాట - ఒకటి, 


అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, 


పచ్చిమిర్చి - ఒకటి, 


కరివేపాకు - రెండు రెమ్మలు, 


ఆవాలు - పావు టీస్పూన్‌, 


జీలకర్ర - అర టీస్పూన్‌, 


నూనె - సరిపడా, 


కారం - అర టీస్పూన్‌, 


పసుపు - చిటికెడు, 


గరంమసాల - ఒక టీస్పూన్‌, 


ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం.. 

 

ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్‌ చేసుకోవాలి. జీడిపప్పుని పావుగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మరికాసేపు వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి. టమాట ముక్కలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. పసుపు, కారం, గరంమసాలా, కరివేపాకు వేసి ఇంకాసేపు వేగించాలి. ఇప్పుడు పుట్టగొడుగులు, జీడిపప్పు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై ఉడికించుకోవాలి. కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు. పుట్టగొడుగులు ఉడికిన తరువాత దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి. చపాతీ లేదా పూరిలోకి లేదా అన్నంలోకి అయినా సరే ఈ పుట్టగొడుగుల ఫ్రై రుచిగా ఉంటుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: