జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లీషు మీడియంపై సొంతపార్టీ నేతలకే చంద్రబాబునాయుడు పెద్ద షాకిచ్చారు. భవిష్యత్తులో నేతలెవరూ ఇంగ్లీషుమీడియంకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని స్పష్టంగా చంద్రబాబు ఆదేశించారట. పార్టీలోని ముఖ్యనేతలతో చంద్రబాబు మాట్లాడుతూ ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా తాము మాట్లాడుతుంటే జనాలందరూ తమకు వ్యతిరేకమైపోతున్నట్లు చెప్పారట.

 

విషయం ఏమిటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో  వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం ఇంగ్లీషుమీడియం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ , ఎల్లోమీడియా మండిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు అండ్ కో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

 

వీళ్ళ వ్యతిరేకతపై జగన్మోహన్ రెడ్డి బహిరంగసభల్లో సూటి ప్రశ్నలు సంధించారు. ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళ పిల్లలు, వారసులు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలంటూ జగన్ సవాలు విసిరారు. జగన్ సవాలను ఎవరూ స్వీకరించకపోయినా మొత్తం మీద వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు.

 

అయితే వీళ్ళు ఊహించని విషయం మరోటుంది. అదేమిటంటే జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఇంగ్లీషుమీడియంను విద్యార్ధులు, తల్లిదండ్రులు పూర్తిగా స్వాగతిస్తున్నారు. అలాగే అవసరమైన ట్రైనింగ్ తీసుకుని పిల్లలకు ఇంగ్లీషులో పాఠాలు చెప్పటానికి టీచర్లు కూడా రెడీ అవుతున్నారు. క్షేత్రస్ధాయిలో జనాల మనోభావాలను పట్టించుకోకుండా వీళ్ళపాటికి వీళ్ళ వ్యతిరేకిస్తుండటంతో జనాల్లో నేతలపై వ్యతిరేకత పెరిగిపోతోంది.

 

గ్రామ, మండల స్ధాయిల్లోని నేతల ద్వారా జనాల మనోభావాలు చంద్రబాబు దృష్టికి వచ్చిందని సమాచారం. దాంతో ఎస్సీ, ఎస్టీ, బిసిలంతా టిడిపి నేతలను అమ్మనాబూతులు తిట్టుకుంటున్నారనే ఫీడ్ బ్యాక్ చంద్రబాబు ముందుకొచ్చింది. దాంతో షాక్ తిన్న చంద్రబాబు వెంటనే నేతలతో మాట్లాడారు. జనాల్లోని ఫీడ్ బ్యాక్ ను ప్రస్తావిస్తూ ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టటంపై నేతలెవరూ వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆదేశించారు.

 

జగన్ నిర్ణయంపై జనాల్లో సానుకూలంగా ఆమోదం లభించిన తర్వాత తాము వ్యతిరేకిస్తే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబుకు అర్ధమైపోయింది. పైగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టి, బిసి వర్గాలే ఎక్కువ. అలాంటిది వాళ్ళల్లో టిడిపిపై వ్యతిరేకత మొదలైతే మరింత నష్టం తప్పదని చంద్రబాబు గ్రహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: