ఉసిరికాయ.. అనుకుంటేనే నోరు ఊరిపోతోంది. పుల్లగా ఉండే ఈ ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ పుల్లటి ఉసిరికాయతో ఎన్నో రకాల రుచికరమైన వంటలు చేసుకుంటూ ఉంటాం. ఉసిరికాయ ఊరగాయ, ఉసిరికాయ కర్రీ, ఉసిరికాయ చట్నీ.. తలుచుకుంటేనే నోరు పులుపు అవుతుంది.. అంత బాగుంటుంది. అయితే ఉసిరికాయ చట్నీ ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు.. ఆలా తెలియని వారందరు ఈ పుల్లటి ఉసిరికాయ చట్నీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                                     

కావలసిన పదార్థాలు...  

                   
ఉసిరికాయలు - ఒక కప్పు(ఉడికించి, గింజలు తీసేసి ముక్కలు చేసినవి), 

                   
నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, 


సోంపు - ఒక టేబుల్‌ స్పూన్‌, 


ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, 


కారం - ఒక టీస్పూన్‌, 


నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, 


ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం... 

 

పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సోంపు వేసి బాగా వేగించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి, ధనియాల పొడి, కారం, నెయ్యి వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి. తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్‌పై నుంచి మిశ్రమాన్ని దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. కావాలంటే చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత అందులో పోపు వేసుకోవచ్చు. అంతే నోరు ఊరించే ఉసిరికాయ చట్నీ రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: