'స్త్రీ లేనిదే జననం లేదు.. స్త్రీ లేనిదే గమనం లేదు.. స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు.. స్త్రీ లేనిదే ప్రపంచమే లేదు' అని అంటుంటాం.. కానీ ఇన్ని ఇచ్చి స్త్రీ మూర్తికి ఎప్పుడు కష్టాలే.. ఎప్పుడు ఎక్కడో ఒక చోట స్త్రీని హింసిస్తూనే ఉంటారు. ఇలా హింసించే ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది.. స్త్రీ'గా పుట్టడం పెద్ద శాపం అని.. ఆడపిల్లగా పుట్టిన సమయం నుండి వృద్ధురాలు అయ్యేవరకు ఎన్ని కష్టాలను ఎదురుకుంటుందో ఒక్క స్త్రీకి మాత్రమే తెలుసు.. 

 

మగవారి చేతిలో కీలు బొమ్మ.. స్త్రీ జీవితం. వరకట్న వేధింపులు... భర్త అనుమానం.. తుంటరి యాదవలా చూపులు.. లైంగిక దాడులు.. ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ వెళ్తే ఒక్క రోజు సరిపోదు.. ఇలా చెప్తున్నా అని ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి ఇవి అని అనుకోకండి.. ఇప్పటికి ఇవి ప్రతి 10 ఇళ్లల్లో 4 ఇళ్లల్లో ఇలా జరుగుతూనే ఉంది.  

 

ఉదాహరణకు నిన్న జరిగిన సంఘటనలే సాక్ష్యం.. బొమ్మలరామారం మండలంలోని రంగపురం అనే గ్రామంలో ఓ మహిళను అదనపు కట్నం కోసం ఆమె భర్త, అత్తమామలు వేధించి హింసించి చంపారు... ఆమె తన రెండేళ్ల బిడ్డపైన కిరోసిన్‌ పోసి నిప్పంటించి బూడిద చేశారు. భర్త, అత్తమామలే ఆమె కూతురును హత్యచేశారని ఆరోపించిన పోలీసుల నుండి పెద్దగా స్పందన లేదు.. 

 

మరోవైపు.. పూర్తిగా మద్యానికి బానిస అయినా ఓ భర్త అతని భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. ఆ అనుమానం కాస్త పెను భూతమై ఆమెని రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు ఆ దుర్మార్గుడు. ఇద్దరు పిల్లలు ఉన్న ఆ తల్లి అనంతలోక్కల్లోకి వెళ్లగా ఆమెను పంపిన భర్త జైలుకెళ్లాడు. దీంతో ఇద్దరు పసికందులు అనాథలయ్యారు. ఈ ఘటనలు కేవలం నిన్న ఓ గ్రామంలో జరిగినవే.. ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్ని జరుగుతాయి అనేది ఒక్కసారి ఆలోచించండి.  

 

నేడు అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినం.. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చిన సరే మహిళలపై వేధింపులు తగ్గటం లేదు.. లైంగిక దాడులు తగ్గటం లేదు.. ఎందుకు ? చట్టం అంటే మగవారికి భయం లేదా ? అందుకే ఈ ధారుణలా ? ఆడవారు ఇన్ని వేధింపులకు గురవుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు.. 9 నెలల పసికందుపై అత్యాచారం జరిగితే మొదట ఉరిశిక్ష వేసిన కోర్టు చివరికి హైకోర్టు ఎందుకు యావజ్జివకారాగారా శిక్ష వేసింది ? 

 

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సరే వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ వేధింపులు, లైంగిక దాడులు అరికట్టడానికి పోలీస్ శాఖ 'షీ' టీంని తీసుకొచ్చింది. మహిళలపై వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ను నివారించేందుకు ఈ షీ టీమ్ లు ఎంతో కృషి చేస్తున్న సరే అవి పెద్దగా ప్రభావం చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

 

ఈ మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు రోజుకు కొన్ని వందల కేసుల నమోదు అయితే అందులో రెండు లేదా మూడింటిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు.. మిగితా అన్ని కూడా కొన్ని రాజకీయంగా మూసి వేస్తే మరికొందరు డబ్బుని అడ్డుపెట్టుకొని సులభంగా బయట పడుతున్నారు... మరి ఈ సామాన్య ఆడవారి సంగతి ఏంటి.. ఈ వేధింపులు ఎప్పుడు తగ్గుతాయి.. ? ఈ చట్టం ఎప్పుడు మారుతుంది ? పోలీసులు ఎప్పుడు రాజకీయ నాయకులకు బెదరకుండా, లొంగకుండా నిందితులకు శిక్ష వేస్తారు ? ఈ కాలంలో అసలు ఇది సాధ్యం అవుతుందా ? మహిళలకు రక్షణ కల్పించగలమా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: