రాజకీయ నాయకులకు .. సినీ సెలెబ్రెటీస్ కు అప్పుడప్పుడు నవ్వు తెప్పించే సంఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేకు ఇటువంటి సంఘటనే ఎదురైంది. ఏపీ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు పలువురు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలాంటివారు చాలామందే ఉన్నా.. కొందరు మాత్రం మీడియాలో హైలెట్ అవుతున్నారు. అలాంటి వారిలో గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎమ్మెల్యే కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విడుదల రజనీ చాలా యాక్టివ్ గా ఉన్నారు. నిత్యం ఆమె ప్రజల మధ్యనే ఉంటున్నారు.

 

అయితే ఒక స్కూల్ పిల్లడు రజనీకి భలే షాక్ ఇచ్చాడు. సభలు.. సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొనే ఆమెకు ఒక స్కూల్ పిల్లాడు ఊహించని రీతిలో సర్ ప్రైజ్ ఇచ్చాడు. నియోజకవర్గ ప్రజల్ని కలుసుకుంటూ వస్తున్న ఎమ్మెల్యే రజనీకి ఒక స్కూల్ పిల్లాడు చటుక్కున బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు. ఆ పిల్లాడు చేసిన చర్యతో ఒక్కసారి అవాక్కుఅయినా.. వెంటనే నవ్వేసి ముందుకెళ్లారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: