ప్రేమ‌గుడ్డిది అంటారు.. విశాఖ‌ప‌ట్నంకు చెందిన ఓ అమ్మాయి సంఘ‌ట‌న వింటే అదే నిజ‌మ‌నిపిస్తోంది. ప్రేమ‌పేరుతో త‌న వాంఛ‌ల‌న్నీ తీర్చుకున్న ఓ యువ‌కుడు చివ‌రికి తామిద్ద‌రం చ‌నువుగా ఉన్న ఫోటోల‌ను బ‌య‌ట‌పెడ‌తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. కొద్దిరోజులుగా డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారిన  యువ‌కుడు త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నాడ‌ని స‌ద‌రు యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మొద‌ట్లో బాగానే ఉన్నాడ‌ని, త్వ‌ర‌లో ఇద్ద‌రం వివాహం కూడా చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నామ‌ని, కానీ ఇంత‌లోనే యువ‌కుడి బుద్ధి తెలిసింద‌ని పోలీసుల ఎదుట క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.

 

ఎలాగైనా తామిద్ద‌రం చ‌నువుగా క‌ల‌సి ఉన్న ఫోటోల‌ను అత‌డి వ‌ద్ద నుంచి  త‌న‌కు ఇప్పించి, త‌న జీవితాన్ని కాపాడాల‌ని వేడుకుంది. యువ‌తి ఫిర్యాదుతో స‌ద‌రు యువ‌కుడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల‌కు అత‌డు చెప్పిన విష‌యాలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయి. యువ‌తి తాను అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌నందు వ‌ల్లే త‌మ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాని తెలిపాడు. అంతేకాక ఈ మ‌ధ్య నీ ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌డం లేదంటూ వ‌దిలించుకోవాల‌ని చూస్తోందని, అందుకే తాను బెదిరింపుల‌కు దిగినట్లు ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండ‌గా అస‌లు యువ‌కుడికి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసేది ఎవ‌ర‌న్న దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. 

 

యువ‌కుడు చెప్పిన వివ‌రాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకుని త‌మదైన శైలిలో విచార‌ణ చేప‌డుతుండ‌టంతో ప‌ట్ట‌ణంలో అనేక గ్యాంగుల‌కు లింక్ ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంద‌ని స‌మాచారం. మొత్తానికి ప్రేయ‌సి..ప్రియుడి మ‌ధ్య త‌లెత్తిన వివాదం...ఓ డ్ర‌గ్స్ మాఫియాను ప‌ట్టించేలా ఉంద‌ని విశాఖ‌వాసులు పేర్కొంటున్నారు. బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకు వచ్చి అమ్ముతున్న‌ట్లుగా అదుపులోకి తీసుకున్న న‌లుగురు ఒప్పుకున్నారు. పలు కాలేజ్ లు మరియు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా వారు పేర్కొన్నారు. మరో వైపు ఆ ప్రియుడిపై కేసు నమోదు చేసి హాస్పిటల్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: