కాకరకాయతో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉంటాయి. కాకరకాయ అంటే చాలు ఎంతో మంది వెనకడుగు వేస్తారు. అయితే ఈ కాకరకాయను చూసి ఎంతమంది వెనకడుగు వేసిన ఈ కాకరకాయ వల్ల జరిగే లాభాలు తెలిసినవారు కాకరకాయను అసలు వదలరు. అయితే అన్ని లాభాలు ఎం ఉంటాయి అని అనుకుంటున్నారా ? 

                         

అదేనండి ఈ కాకరకాయ వల్ల అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇలా ఎలా కావాలంటే ఆలా కాకరకాయతో లాభాలను పొందవచ్చు. అయితే ఈ కాకరకాయ వేపుడు ఎలా చెయ్యాలి అనేది చాలామందికి తెలియదు. అలాంటివారు ఇక్కడ చదివి ఎలా చేయాలో తెలుసుకోండి.. 

 

కావాల్సిన పదార్ధాలు... 

 

కాకరకాయలు : 3

 

కారం : 4 టేబులు స్పూన్లు 

 

ఉప్పు : రుచికి తగినంత

 

పసుసు : చిటికెడు

 

కరివేపాకు : రెండు రెబ్బలు

 

తాలింపు దినుసులు : 2 టేబుల్ స్పూన్లు 

 

నూనె : వేయించడానికి సరిపడా

 

కొబ్బరిపొడి : 1/2 కప్ 

 

తయారీ విధానం... 

 

ముందుగా కాకరకాయలు ముక్కలుగా కోసి కొద్దిగా నీళ్ళు ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేవరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత ముక్కలను ఎండలో రెండు గంటల సేపు ఎండబెట్టాలి. ఆ తరువాత నూనె మరిగిన తరువాత పోపు తాలింపు పెట్టి కాకరకాయ ముక్కలు వెయ్యాలి. ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తరువాత ఎండుకొబ్బరి పొడి 4 చెంచాలు వెయ్యాలి. బాగా ఫ్రై అయిన తరువాత కారం వేసి దించుకోవాలి. అంతే కాకరకాయ వేపుడు రెడీ. ఇంకెందుకు ఆలస్యం కాకరకాయ వేపుడు చేసేసుకొని ఆరోగ్య లాభాలను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: