పప్పు ఎన్నోరకాలు చేసుకుంటుంటాం.. మిరపకాయల పప్పు, కారం పప్పు, యెర్ర పప్పు, అక్కురా పప్పు, మెంతి పప్పు ఇలా ఎన్నో రకాల రుచికరమైన పప్పు చేసుకొని తినచ్చు. ఈ పప్పు అందరు చేసుకునేదే.. ఎంతోమంది అమ్మ చేత్తో చేసిన పప్పు తినాలి అనుకుంటారు.. అలానే ఊరు వెళ్తూనే ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని ఎంతో ఇష్టంగా తింటారు. 

               

అయితే ఇన్ని రకాల పప్పు తిన్న మీరు ఎప్పుడైనా కొబ్బరి పప్పు తిన్నారా ? ఎంతబాగుంటుందో తెలుసా ? ఒక్కసారి ఆ పప్పు తిన్నాం అంటే చాలు మళ్ళి మళ్ళి ఆ పప్పుతో తినాలి అనిపిస్తుంది. అయితే ఆ పప్పు ఎలా చేసుకోవాలో, ఆ పప్పుకు కావల్సిన్న పదార్ధాలు ఏంటో చాలామందికి తెలియదు. అలాంటివారు అంత కొబ్బరి పప్పు ఎలా చేసుకుంటే రుచికరంగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు.. 

 

పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క, 

 

పెసరపప్పు-రెండు కప్పులు, 

 

పచ్చిమిర్చి-మూడు, 

 

ఉల్లిపాయలు- చిన్నవి రెండు, 

 

నూనె, ఆవాలు,

 

జీలకర్ర-పోపుకు సరిపడా, 

 

పసుపు-చిటికెడు, 

 

ఉప్పు-రుచికి సరిపడా, 

 

మంచినీళ్లు- అర కప్పు.

 

తయారీ విధానం.. 

 

ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి ఓ గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తరువాత పాన్ లో కొద్దిగా నూనె పోసి, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి, మంచినీళ్లు పోసి ఉడికించాలి. ఆఖరున రుచికి తగినంత ఉప్పు కలుపుకుని దించేయాలి. అంతే - కొబ్బరి పప్పు తయారైనట్లే. వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పప్పు వేసుకుని తింటే ఆహా  ఏమి రుచి అని అంటారు. అంతబాగుంటుంది ఈ కొబ్బరి పప్పు. 

మరింత సమాచారం తెలుసుకోండి: