రొయ్యలు.. ఎంతోమందికి ఈ రొయ్యలు అంటే చాలా ఇష్టం. అయితే అందరూ ఈ రొయ్యలను అందరూ కూర చేసుకొని తింటారు మరికొందరు ఫ్రై చేసుకొని తిని ఉంటారు కానీ ఎప్పుడు చట్నీ చేసుకొని ఉండరు.. కానీ రొయ్యల చట్నీ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ రొయ్యల చట్నీ తింటే ఆహా ఏమి రుచి అని అంటారు. అయితే ఈ రొయ్యల చట్నీ ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు.. 


చిన్న రొయ్యలు - అరకేజీ, 


ఎండు కొబ్బరి పొడి - 1 టేబుల్‌ స్పూను, 


ధనియాల పొడి - 1 టేబుల్‌ స్పూను, 


జీరా - 1 టీ స్పూను, 


కరివేపాకు - 4 రెబ్బలు, 


గరం మసాలా - అర టీ స్పూను, 


అల్లం వెల్లుల్లి - 1 టీ స్పూను, 


లెమన్‌ జ్యూస్‌ - 1 కప్పు, 


ఆవాలు - 1 టీ స్పూను, 


నూనె - 1 కప్పు, 


ఎండుమిర్చి - 2, 


కారం - అర కప్పు, 


ఉప్పు - రుచికి తగినంత, 


పసుపు - అర టీ స్పూను. 

 

తయారీ విధానం..

 

రొయ్యలకు పసుపు, ఉప్పు పట్టించి కొద్ది నూనెలో నీరంతా ఇగిరేదాకా వేగించాలి. వీటికి అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి పక్కనుంచాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి ఎండుమిర్చి, జీరా, ఆవాలు, ధనియాల పొడి, కరివేపాకు వేగించి చల్లారనివ్వాలి. ఒక వెడల్పాటి పాత్రలో రొయ్యలు, లెమన్‌ జ్యూస్‌, కారం, ధనియాలపొడి, కొబ్బరిపొడి, గరం మసాలా బాగా కలిపి చల్లారిన తర్వాత నూరాలి. అనంతరం అందులో పోపు వేసి కలపాలి. అంతే.. ఎంతో రుచికరమైన రొయ్యల చట్నీ రెడీ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: