బాదం పప్పు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతిరోజు రాత్రి నీటిలో రెండు లేక మూడు బాదం పప్పులను నాన పెట్టుకొని ఉదయం పూట తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో శరీరానికి శక్తినిచ్చే పోషక పదార్థాలు ఎన్నో ఉంటాయి.

 

    మనందరికీ ఇష్టమైన బాదం పప్పు తో ఒక టేస్టీ స్వీట్ చేద్దామా ఫ్రెండ్స్. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే కమ్మని, తీయని స్వీట్ బాదం బర్ఫీ.


   ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు బాదం బర్ఫీ కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా...

కావాల్సిన పదార్దాలు :


1)బాదంపప్పు-3/4 కప్
2)పంచదార -1/2 కప్
3)యాలుక్కాయ పొడి -1/4 టీ స్పూన్
4)నీరు -1/4 cup
5)నెయ్యి -సరిపడా
6)పిస్తా పప్పు - 1 తాబేలు స్పూన్


తయారీ విధానం:


   ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 2 కప్స్ వాటర్ పోసి బాగా కాగనివ్వాలి. తర్వాత బాదంపప్పుని ఆ కాగిన నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. రెండు నిమిషాలు అయ్యాక వెంటనే బాదంపప్పులని తీసివేసి చల్లని నీటిలో కడగాలి. ఒక నిమిషం పాటు అలానే ఉంచాలి. బాదాం పప్పు తొక్కు  అంత తీసివేయాలి.నీరు  పోయేలా ఒక క్లాత్ లో ఆరబెట్టాలి. 
పూర్తిగా ఆరిపోయిన బాదం పప్పుని ఒకసారి పాన్ లో వేసి పొయ్యి మీద పెట్టి వేపాలి. తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు. అలా చేయడం వల్ల బాదం పప్పులో ఉన్న నూనె బయటికి వచ్చి రుచి అనేది తగ్గిపోతుంది.


   స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో పంచదార మరియు నీరు పోయాలి. పంచదార మొత్తం కరిగిపోవాలి. పంచదార పాకంలో ముందుగా గ్రైండ్ చేదుకున్న మిశ్రమం ని వేయాలి. గరిటెతో తిప్పుతూ ఉండాలి.అప్పుడపుడు నెయ్యి కలుపుతూ ఉండాలి, తర్వాత యాలుక్కాయ పొడి వెయ్యాలి దీని వల్ల మంచి సువాసన వస్తుంది స్వీట్ కి. ఎప్పుడైతే పాన్ కి అంటకుండా మిశ్రమం ఉంటుందో అప్పుడు స్టౌ ఆపేయాలి.


    పిస్తా పప్పుల్ని చిన్న చిన్న ముక్కలగా కోసి ఆ మిశ్రమం లో వేయాలి.. తరువాత ఒక
ప్లేట్ లో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి సరిగా సర్దాలి..ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లారాక ముక్కలాగా కోయాలి... అంతే రుచికరమయైన, తీయనైన, బాదాం - బర్ఫీ రెడీ...
మీరు ఇంట్లో చేసి చెప్పండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందొ...


మరింత సమాచారం తెలుసుకోండి: