బెండకాయ... ఈ కూరగాయ తింటే గణితం బాగా వస్తుంది అని చెప్తుంటారు మన పెద్దలు. అందుకే అమ్మ వాళ్ళు బెండకాయని వివిధరకాల వంటలు చేస్తారు. బెండకాయ తినగానే ఆహా ఏమి రుచి అని అనేలా చేస్తారు.. అయితే అమ్మ వాళ్ళు ప్రతిసారి కూడా బెండకాయ తాలింపు, బెండకాయ రసం, బెండకాయ కూర చేస్తుంటారు. అయితే ఇప్పుడు అందులో మరో వెరైటీ యద చెయ్యండి.. అది ఏంటంటే బెండకాయ పెరుగు చట్నీ.                                     

                     

కావలసిన పదార్థాలు... 

                                

బెండకాయలు - అర కిలో, 


పచ్చికొబ్బరి తురుము - అర కప్పు, 


పెరుగు - ముప్పావు కప్పు, 


పచ్చిమిర్చి - 3, 


నూనె - వేగించడానికి సరపడా, 


ఉప్పు - రుచికి తగినంత. 

 

తాలింపు కోసం.. 

 

కొబ్బరినూనె - అర టేబుల్‌ స్పూను, 


ఆవాలు - అర టీ స్పూను, 


ఎండుమిర్చి - 2, 


కరివేపాకు - 4 రెబ్బలు.

 

తయారీ విధానం.. 

 

బెండకాయల్ని అంగుళం పొడవున తరిగి నూనెలో దోరగా వేగించి ఉప్పు చల్లి పక్కనుంచాలి. మిక్సీలో పచ్చిమిర్చి, కొబ్బరి తరుగు, పెరుగు మెత్తగా నూరి, వేగించిన బెండలో కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు. తర్వాత దోరగా వేగించిన తాలింపుని బెండ మిశ్రమంలో కలపాలి. ఈ చట్నీ పరాటాల్లో బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: