అమ్మ అన్నమాట కి అర్దాలే వేరు.. ఎన్ని చెప్పిన అమ్మ గొప్పతనం ముందు అన్ని తక్కువే. పుట్టినప్పటినుండి ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులని ఎదుర్కొని మనల్ని ముందుకు నడిపే గొప్ప త్యాగమూర్తి అమ్మ.. పసితనంలో అమ్మ వెలుపట్టుకుని నడిచి, నడవడిక నేర్పింది మన అమ్మేకదా !! వయసుకు వచ్చాక నెల నెల నెలసరి సమస్య తో బాధ ని అనుభవించి, సమాజంలోని క్రూరముగాలనుండి ఎలాగోల తపించుకుని, పెళ్లి అనే మూడు ముళ్లబంధం లోకి అడుగుపెడుతుంది...


    ఎవరో తెలియని వ్యక్తితో తాళి కట్టించుకుని, అత్తవారింట్లో అడ్డుపెట్టి ఒడిదుడుకులని ఎదుర్కొంటుంది.. అమ్మ-నాన్నలని ఒక్కసారి గా వదిలేసి, ఉన్న ఊరినుండి వేరే ఊరు, వేరే ఇల్లు, వేరే మనుషులు, కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.. అప్పగింతలపుడు ఎంత ఏడుస్తారో వాళ్ళకే తెలుసు.. అత్త మరియు ఆడబిడ్డ, భర్త మంచివాళ్లయితే పర్వాలేదు.. కానీ చెడ్డవాళ్ళు అయితే అ ఆడపిల్ల పరిస్థితి వర్ణనాతీతం.


ఇక్కడ బాధపెట్టే అత్త మరియి ఆడబిడ్డ కూడా ఆడవాళ్లే... స్వతహాగా అందరు మంచివాళ్ళే కానీ అందరి స్వభావం ఒకేలా ఉండదు.. సందర్భానుసారం మారతారు..
సంసార సాగరంలో మునిగి పోయి తన బాధ్యతలని నెరవేరుస్తూ, ఇంటి పనులు చేస్తూ, అందరి ఆలనా పాలనా చూస్తుంది. ఒకవేళ భర్త దుర్మార్గుడు అయిన భరిస్తుంది. పుట్టినింటి వాళ్ళు ఒక మాట తన భర్త ని ఎమన్నా అన్న సహించదు.. తెలిసి తెలియని వయసు లో వాంతులు, నీరసం ఏమి అయిందో కూడా పాపం తెలియని పరిస్థితి లో అయోమయలో కంగారుపడిపోతుంది.. అపుడు తెలుస్తుంది తన కడుపులో ఒక "బిడ్డ " ఉందన్న విషయం..


   అపుడు చుడాలి అ ఆడపిల్ల ముఖం ఎంత వెలిగిపోతుందో. అప్పటిదాకా తను పడ్డ కష్టాలు అన్ని మరిచిపోయి "తన చేయి ని తన పొట్ట మీద పెట్టుకుని ఎంతో మధురానుభూతి పొందుతుంది మన అమ్మ "
తొమ్మిది నెలలు మనల్ని మోసి, మందులు మింగి, వాంతులతో, ఇంట్లో పనితో అలిసిపోయి సొలిసిపోయి, మనకి జన్మ నిచ్చింది. పురిటి నొప్పులు అనుభవించి మనల్ని భూమి మీదకి రప్పిoచింది అమ్మ. "మరో జన్మ అమ్మ కి ఇది " ఎంత బాధని పడ్డ గాని అపుడే పుట్టిన మనల్ని చూసుకుని, మన బుజ్జి బుజ్జి చేతులు, కాళ్ళను చూసుకుని, మనకి ముద్దుపెట్టుకుని తన బాధని మర్చిపోతుంది.. మనల్ని పెద్దవాళ్ళని చేసి, ప్రయోజకుల్ని చేసి పెళ్లి చేసి ఒక ఇంటివాళ్ళని చేస్తుంది. కన్నా దగ్గర నుండి పెంచేదాకా ఎన్నో ఒడిదుడుకులని తట్టుకుని మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది" తల్లి "


అలాంటి," తల్లి, భార్య చెల్లి, అక్క, పిన్ని, వదిన, ఫ్రెండ్, ప్రేయసి, అమ్మమ్మ, నానమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, మరదలు, అత్తమ్మ, మేనకోడలు" అందరు ఆడవాళ్లే కదా !!వాళ్లే లేకపోతే మనం ఎవరిని బంధుత్వంతో పిలుస్తాము చెప్పండి.. "ఆడవాళ్ళని బ్రతకనిద్దాం,మన విలువల్ని కాపాడుదాం "


•""సృష్టి కర్త ఒక బ్రహ్మ, అతనిని సృషించిందో అమ్మ ""అ తల్లే(ఆడది ) లేదనుకో మనకి సృష్టి అనేదే లేదు.. మీరు నిజం అని భావిస్తే ఒక్కసారి మీ అమ్మ కి "ఐ లవ్ యూ అమ్మ" అని చెప్పండి...ఒకసారి ధన్యవాదములు తెలియచేయండి 🙏🙏🙏🙏🙏 

మరింత సమాచారం తెలుసుకోండి: