హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.  ఇలాంటి పాపానికి ఒడిగట్టిన ఆ నలుగురు దుర్మార్గులను నడిరోడ్డుపై ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్ హత్యపై సామాన్య ప్రజల నుంచి సినీ, రాజయకీయ ప్రముఖులు వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.వారికి మద్దతుగా ప్రజా, మహిళా సంఘాలు సంతాప కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇలా ఏర్పాటుచేసిన ఒక సంతాప సభలో ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ పాల్గొన్నారు. వెటర్నరీ డాక్టర్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
 
క్రిమినల్స్ ఎక్కడి నుంచో రాలేదని, మనలో నుంచి వచ్చినవాళ్లేనని.. ఇలాంటి ఘటనలకు మనమంతా బాధ్యులమేనని సుకుమార్ అన్నారు. మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే పోర్న్ సైట్స్ దర్శనమిస్తున్నాయని, ఆల్కహాల్ కూడా విచ్చలవిడిగా దొరుకుతోందని చెప్పారు. ఇది వరకు ఇంత క్రైమ్ లేదని అన్నారు. అయినా, ఇలాంటివన్నీ చెప్పడానికి తాము అస్సలు సరిపోమని అనుకుంటున్నానని సుకుమార్ తెలిపారు.

 ఇలాంటి సంఘటనలు మన సొసైటీలో జరుగుతుండటం చాలా బాధాకరమని, వాస్తవానికి ఆయన ఈ విషయంపై మాట్లాడటానికే చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మాయిని అంత దారుణంగా చేసి కాల్చేశారు అనగానే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు, సంబంధం లేనివాళ్లు కూడా 
కన్నీళ్ళు  పెట్టారు. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా బతకాలి అని అంతా భయపడుతున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి 100కి ఫోన్ చేసి ఉండొచ్చు కదా అని అందరూ అంటున్నారు, నాకు ఏమనిపిస్తుందంటే.. స్కూటర్ పాడైంది, నలుగురు అబ్బాయిలు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్లమీద 100‌కు ఫోన్ చేసి ఉంటే, ఒకవేళ పోలీసులు వస్తే.. ఏంటక్కా, హెల్ప్ చేస్తుంటే మా మీద ఇంత అనుమానం పడతావా? అని ఆ అమ్మాయి అనుకుని ఉండొచ్చు. అంటే అమ్మాయిలు అబ్బాయిలను అంతగా నమ్ముతారు. కానీ ప్లీ్జ్ అమ్మ.. మేము మగాళ్లం కాదు, మృగాలం.. మమ్మల్ని నమ్మొద్దు. సొంత తండ్రి, అన్న, తమ్ముడిని కూడా నమ్మొద్దు. ఎందుకంటే ప్రపంచం అలా ఉంది. ముందు 100కి ఫోన్ చేయండి. తప్పయితే తరవాత సారీ చెప్పొచ్చు. ఎవ్వరినీ నమ్మొద్దు.. అందరిపైనా అనుమాన పడండి. అనుమానంతోనే బతకండి అని సుకుమార్ ఎమోషనల్‌గా మాట్లాడారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: