కావాల్సిన ప‌దార్థాలు:
బోన్లెస్ చికెన్‌- ఒక కేజీ
ఉల్లిపాయ- ఒకటి
బీన్స్‌- అరకప్పు
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

క్యాబేజి తురుము- అరకప్పు
క్యారెట్‌ ముక్కలు- అరకప్పు
నూనె- అర లీటర్‌
మసాలా పౌడర్- ఒక స్పూన్

 

కారం- సరిపడగా
మైదా పిండి- పావు కిలో
కొత్తిమీర- కొద్దిగా
గుడ్డు- ఒకటి

 


తయారీ విధానం:
ముందుగా ఓ గిన్నెలో మైదాను తీసుకొని అందులో ఎగ్ వైట్‌ను వేసి సరిపడ నీరును పోసి  చపాతీ పిండిలాగా మెత్తగా కలిపి తడిగుడ్డతో కప్పి అరగంట సేపు నానపెట్టాలి. ఇప్పుడు  చికెన్‌ను ఉడకబెట్టు కోవాలి. ఇప్పుడు కూర‌గాయ‌ల‌ను, చికెన్‌ను సన్నని పొడు గాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి ముక్కలు, బీన్స్‌, క్యాబేజి, క్యారెట్‌ ముక్కలు, కారం, ఉప్పు వేయాలి. 

 

ఇప్పుడు ఆ ముక్క‌లు కొంచెం మ‌గ్గాక‌ చికెన్ వేసి మసాలా పౌడర్ వేసి బాగా  వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని చపాతీల్లా వత్తి అందులో చికెన్‌ మసాలా మిశ్రమాన్ని పెట్టి మూసి రోల్స్‌లాగా చుట్టి పెట్టాలి. తరువాత స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగాక అందులో చపాతీలను నూనెలో ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే వేడి వేడి క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌ రోల్స్ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: