నిమ్మచారు ఎప్పుడైనా తిన్నారా.. అనుకుంటేనే నోరు ఆరిపోతున్న నిమ్మ చారు ఎంతో బాగుంటుంది. అనుకుంటేనే నోరు ఊరిపోతోంది కదా ? అలాంటి నిమ్మచారు ఎప్పుడైనా తిన్నారా ? ఎలా చేసుకోవాలో తెలుసా ? ఎంత బాగుంటుందో.. అలాంటి నిమ్మచారుని ఎలా చేస్తే అదిరిపోతుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. నిమ్మ చారు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.  

                                 

కావలసిన పదార్థాలు... 

             

కందిపప్పు లేదా పెసరపప్పు - 100 గ్రా,

                        

నిమ్మరసం - 2 టీ స్పూన్లు, 

                          

ఉప్పు - రుచికి తగినంత, 

                    

కరివేపాకు- 4 రెబ్బలు, 

               

కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, 

               

పచ్చిమిర్చి - 3, 

 

నెయ్యి - అర టేబుల్‌ స్పూను, 

 

ఆవాలు, మెంతులు, ఇంగువ, జీలకర్ర - తాళింపుకు సరిపడా. 

 

తయారీ విధానం... 

 

పప్పుని ఉడికించి పై నీరంతా తీసి పక్కనుంచాలి. కడాయిలో నెయ్యి వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చితో తాలింపు పెట్టి మరగనివ్వాలి. దించేసి ఉప్పు, నిమ్మరసం వేసి మూతపెట్టి కాసేపు ఉంచాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: