సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక అమాయకపు ఆడపిల్ల మీద మృగాళ్ల ప్రవర్తించి రేప్ చేసి చంపేసిన ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని ఆగ్రహంతో రగిలిపోయేలా చేస్తుంది. జ‌నాలు రోడ్ల మీదికి వ‌చ్చిన ఆందోళ‌న చేస్తున్నారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. నివాళి అర్పిస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో సైతం ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో ఆక్రోశం వ్య‌క్త‌మ‌వుతోంది.  ఇలాంటి త‌రుణంలో కూడా కొంద‌రు పైశాచిక ఆనందం పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్రియాంక హ‌త్య‌కు ముందు ఆమెపై అత్యాచారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో కోసం ఇంట‌ర్నెట్లో పెద్ద ఎత్తున సెర్చింగ్ జ‌రుగుతుండ‌టం దారుణ‌మైన విష‌యం.



దీనితో ఈ విషయం తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి శాడిస్టులు వంద మందో వెయ్యి మందో ఉంటారులే అనుకుంటాం. కానీ ఏకంగా 80 ల‌క్ష‌ల మందికి పైగా ప్రియాంక రేప్ వీడియో కోసం ఇంట‌ర్నెట్లో, పోర్న్ వెబ్ సైట్ల‌లో శోధించిన‌ట్లుగా ఒక రిపోర్ట్ బ‌య‌టికి రావ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి మ‌నుషుల్లో పైశాచిక స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 



ఎన్ని మరణ శిక్షలు వేసినా .. మైండ్ సెట్ లో మార్పు రాకపోతే పరిస్థితి మారదు. మామూలుగా పోర్న్ వీడియోలు చూసేవాళ్ల‌ను కూడా ప్రియాంక ఉదంతం క‌దిలించే ఉంటుంది. ఆమెకు జ‌రిగిన‌ అయ్యో అనుకునే ఉంటారు. కానీ ఈ ఉదంతంలో బాధాక‌ర కోణాల్ని మ‌రిచిపోయి బాధితురాలి రేప్ వీడియో కోసం ఇన్ని ల‌క్ష‌ల మంది ఇంట‌ర్నెట్లో శోధించారంటే ఏమ‌నుకోవాలి? మ‌న స‌మాజం ఎటు పోతోంద‌నుకోవాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: