మహిళలపై రానురాను అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. మహిళలు ఒంటరిగా వెళ్లాలన్న భయపడిపోతున్నారు. అందుకని మహిళల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఒక మంచి కార్యక్రమం చేసారు. అదే "అభయ్ డ్రాప్ హోమ్ సర్వీస్". దీనిని మహిళలు ఎవరన్నా ఉపయోగించుకోవచ్చు.

అత్యవసర సమయాలలో మహిళలు ఓక్కోసారి బయటకి వెళ్లాల్సి వస్తుంది, లేదంటే కార్ గాని, బైక్ గాని పని చేయనపుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో భయపడుతూ వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకి అభయ్ డ్రాప్ హోమ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. 'రాత్రి 9గంటల నుంచి వేకువజామున 5 గంటల వరకు మహిళల్ని పోలీసు వాహనాల్లో తీసుకునివెళ్లి ఇంటిదగ్గర డ్రాప్ చేస్తారు'. వాహనంలో డ్రైవర్ తో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటుంది.


మహిళలు భయపడకుండా ఉండాలి అని పోలీసులు అభయం ఇస్తున్నాము అని చెప్పడానికి దీనికి" అభయ్ "అనే పేరు పెట్టారు. రాను రాను మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఒంటరి మహిళలు వెళ్లాలంటే భయపడిపోతున్నారు అందుకే ఈ అభయ్ డ్రాప్ హోమ్ సర్వీస్ ని ప్రారంభించామని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ తెలిపారు.. బుధవారం ఎస్పీ కౌశల్ చేతులమీదగా ఈ అభయ్ వాహనాలను ప్రారంభించారు.

రోజు ఎదో ఒక చోట ఏదోలా మహిళలపై దాడి జరుగుతూనే ఉంది. ఇందుకు నిదర్శనం "దిశ" హత్యాచారం. ఇప్పటికే ప్రభుత్వం మహిళల భద్రతకోసం మెట్రోలోకి పెప్పర్ స్ప్రే అనుమతించడం , ఎమర్జెన్సీ టోల్ ఫ్ర్రీ నంబర్స్, లొకేషన్ ఐడెంటిఫై చేసే అప్లికేషన్స్, ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.


ప్రకాశం జిల్లా ప్రవేశపెట్టిన ఈ అభయ్ డ్రాప్ హోమ్ సర్వీస్ ఆలోచన అందరికి ఆదర్శం.. ఇలాంటి ఆలోచన అన్ని జిల్లాలో అమలు అవ్వాలని, ఇకనుంచి అయినా మహిళలపై అత్యాచారాలు తగ్గాలని కోరుకుందాం... 

మరింత సమాచారం తెలుసుకోండి: