కావాల్సిన‌ పదార్ధాలు:
సొరకాయ- ఒకటి
సగ్గు బియ్యం- ఒక కప్పు
పంచదార- రెండు కప్పులు

 

యాలుకల పొడి- ఒక టీ స్పూన్ 
నచ్చిన ఫుడ్ కలర్- చిటికెడు
నెయ్యి- ఒక కప్పు

 

జీడిపప్పులు- కొద్దిగా
కిస్మిస్‌- కొద్దిగా
బాదంలు- ప‌ది

 

త‌యారీ విధానం: 
ముందుగా సొర‌కాయ‌ను చెక్కుతీసి నీటితో శుభ్రం చేసి.. తురుముకొని ప‌క్క‌పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో సగ్గుబియ్యం, రెండు క‌ప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. మెత్తగా ఉడికి చిక్కగా వచ్చాక స్టౌ ఆప్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద మ‌రో పాన్‌ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్‌, బాదంలు వేసి దోరగా వేపి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కాస్త నెయ్యి వేసి సొరకాయ కోరు వేసి, పచ్చి వాసన పోయే వరకు వేపి దానిలో సగ్గుబియ్యం మిశ్ర‌మం, పంచదార వేసి స్లో ఫ్లేమ్‌ మీద ఉడకనివ్వాలి.

 

ఇప్పుడు పంచదార కరిగి హల్వా దగ్గరకు వచ్చాక మిగిలిన నెయ్యి, వేపిన జీడిపప్పులు, బాదంపప్పులు, కిస్మిస్‌లు, యాలుకలపొడి, ఫుడ్‌ కలరు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఓ ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి స‌ర్వ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ సొరకాయ హల్వా రెడీ. దీన్ని వేడి వేడిగా తిన్నా లేదా చ‌ల్లార‌క తిన్న సూప‌ర్‌గా ఉంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: