ప్రజల్లో డయల్ 100 నెంబర్ మీద అవగాహన చాలా తక్కువ.. అసలు 100 నెంబర్ డయల్ చేస్తే ఎవరికి కాల్ వెళ్తుందో తెలుసా? పోలీసులకి! కాని ప్రజల్లో చాలా మందికి దీని మీద అవగాహన లేదు. అదే 108 అంటే టక్కున అంబులెన్సు అని ఏదన్న ఆరోగ్య పరిస్థితి బాలేన్నపుడు 108 కి డయల్ చేస్తే అంబులెన్సు వచ్చి రోగిని హాస్పిటల్ కి తీసుకువెళ్లే వాహనం అని టక్కున చెప్పేస్తారు.

కాని 100 కి డయల్ చేస్తే ఏదన్న సమస్య ఉంటే పోలీసులు వస్తారని చాలా మందికి తెలియదు.. తెలిసిన అంతగా పట్టించుకోరు..
 ఇప్పుడు జరిగే సంఘటనల ఆధారంగా ప్రజలలో 100 నెంబర్ మీద అవగాహన పెరిగింది.


వివరాలలోకి వెళితే ఒక వ్యక్తి కుటుంబకలహాలతో ఆత్మహత్యా యత్నం చేసాడు. 100 కి  కాల్ చేస్తే పోలీసులు చాకిచక్యం తో అతన్ని కాపాడారు. సికింద్రాబాద్లో నివాసం ఉంటున్న మహ్మద్ బేగం, ఆమె భర్త గతకొంతకాలంగా గొడవ పడుతున్నారు. గురువారం గొడవ మరి ఎక్కువ కావడంతో మహమ్మద్ బేగం మీద కోప్పడి గదిలోకి వెళ్ళి ఫ్యాన్ కి ఉరివేసుకోపోయాడు.

అది గమనించిన మహమ్మద్ '100' కి ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడి జరిగిందంతా చెప్పింది. బేగం సమాచారంతో చిలకలగూడ పోలీసులు కేవలం ముడే మూడు నిమిషాలలో వచ్చి తలుపులు పగలకొట్టి మరి అతన్ని కాపాడి హాస్పిటల్ కి తరలించారు.

ప్రాణాపాయం ఏమిలేదని వైద్యులు చెప్పి ప్రధమ చికిత్స చేసి ఇంటికి పంపించేశారు. తర్వాత భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.. కానిస్టేబుల్, డ్రైవర్ ని చిలకలగూడ ఎస్సై అభినందించారు. పోలీసులు ఇలానే వాళ్ల పనిని సక్రమంగా చేస్తూ ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడగలిగితే 100 కి ఫోన్ చేసే వారి సంఖ్య పెరిగిద్ది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: