దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం నిందితుల ఎన్ కౌంటర్ నిముషాల్లోనే జరిగిపోయినట్లు సమాచారం. దిశపై హత్యాచార ఘటన వెలుగు చూసిన తర్వాత నుండి పోలీసుల్లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోయింది.  గతంలో ఏ కేసు విషయంలో కూడా జనాల్లో ఇంతటి తీవ్ర ఉద్రేకం కనబడబలేదు. నిందితులు నలుగురిని పట్టుకున్నప్పటి నుండి వారిని తమ చేతుల్లోకి తీసుకుని చంపేద్దామన్నంత కసి జనాల్లో కనబడింది.

 

 విచారణ నిమ్మితం శంషాబాద్ పోలీసు స్టేషన్లో ఉంచిన నిందితులపై దాడి  చేయటానికి జనాలు స్టేషన్ ను చుట్టుముట్టడంతో  పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ఒకదశలో పోలీసు స్టేషన్ పై దాడి చేయటానికి జనాలు శతవిధాల ప్రయత్నం చేయటంతోనే నిందితులపై జనాల్లో ఏ స్ధాయిలో ఆవేశం ఉందో ప్రభుత్వానికి, పోలీసులకు అర్ధమైపోయింది. అందుకే భారీ భద్రత మధ్య వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

 

చర్లపల్లి జైలుకు తరలించినా నిందితులపై జనాల్లో ఆగ్రహం చల్లారలేదు. ఎందుకంటే జైలు ముందు కూడా యువత భారీ ఎత్తున గుమిగూడారు. జైల్లో ఉన్న నిందితులను తమకు అప్పగించాలంటూ వేలాదిమంది యువత పెద్ద ఎత్తున నిరసన ప్రద్శనలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.  దాంతో నిందితులను ఎక్కడ ఉంచినా వారికి భద్రత ఉండదన్న విషయం పోలీసులకు బాగా అర్ధమైపోయింది.

 

అదే సమయంలో నిందితులను కాల్చి చంపేయాలని, బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో వాళ్ళ విచారణ కూడా పోలీసులకు సవాలుగా మారింది. వీళ్ళు బహిరంగంగా ఎక్కడ కనబడినా జనాలు వాళ్ళని కొట్టి చంపేస్తారన్న విషయం పోలీసులకు అర్ధమైపోయింది.

 

జనాల డిమాండ్ ఆమోదయోగ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షలు పడేట్లు చేయటమే చట్టం, న్యాయం చేయాల్సింది. అందులో భాగంగానే విచారణ కోసం నియమించిన సిట్ బృందం వారిని జ్యుడిషియల్ రిమాండ్ నుండి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

 

హత్యాచారం ఘటనను వారి ద్వారానే తెలుసుకునేందుకు నలుగురిని శంషాబాద్ ప్రాంతంలోని చటాన్ పల్లి కి శుక్రవారం అర్ధరాత్రి తీసుకొచ్చారు. అయితే అక్కడ హఠాత్తుగా నలుగురు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసుల నుండి తుపాకులను లాక్కుని బెదిరించి తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించారట. దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు చివరకు వారిని ఎన్ కౌంటర్ చేసినట్లు సమాచారం. సీన్ రికన్ స్ట్రక్షన్ , ఎన్ కౌంటర్ అంతా నిముషాల్లోనే జరిగిపోయినట్లు తెలుస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: