దిశ కేసులో నిందితులను ఈ రోజు తెల్లవారుజామున ౩న్నర గంటలకు పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. దీంతో ఒక్క తెలంగాణానే కాదు.. దేశం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తుంది. నిందితులకు ఇలాంటి శిక్ష పడితేనే మళ్లీ ఇలాంటి దారుణమై సంఘటనలు జరగకుండా ఉంటాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే తెలంగాణలో జరిగిన దిశ కేసు ఎన్‌కౌంటర్ ఘటనపై ఢిల్లీలోని నిర్భయ తల్లి ఆశా దేవికూడా హర్షం వ్యక్తం చేశారు. నలుగురు నిందితుల్నీ ఒకేసారి కాల్చి చంపడం తనకు  ఎంతో ఆనందం కలిగించిందని ఆమె అన్నారు. తెలంగాణ పోలీసులు చేసిన పనికి ఆమె జేజేలు కొట్టారు.  

 

నిర్భయ కేసు నిందితుల విషయంలో వాళ్ళకు శిక్ష పడాలని నేను ఏడు సంవత్సరాలనుండి పోరాడుతున్నానని,  కోర్టు చుట్టు తిరుగుతున్నాని కాని కోర్టు మాత్రం స్పందిచడం లేదని.. వారిని శిక్షించాలంటే హ్యూమన్ రైట్స్ అడ్డు వస్తున్నాయని చెప్తున్నారని..  ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. నిర్భయపై ఘటన జరిగి నేటికి 7 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వతీరులో గని కోర్టు తీరులో చలనం లేదన్నారు. ప్రతీరోజు చేతులు జోడించి కోర్టును వేడుకుంటున్నాను. కనిపించిన మంత్రి ఇంటికి వెళ్లి  నాకు న్యాయం చేయమని అర్ధిస్తున్నారు.  కాని ఇంత వరకు నిర్భయకు న్యాయం జరగలేదని అన్నారు . నిర్భయ ఘటనతో మాకు న్యాయం జరగక ప్రతీ క్షణం చస్తూ బ్రతుకుతున్నామని ఆమె  కన్నీటి పర్యాంతమవుతున్నారు.


 ఇప్పుడు తెలంగాణాలో  పోలీసులు నిందితులకు విధించిన శిక్షను  డిల్లీ కోర్టు, పోలీసులు గమనించాలని .. ఇప్పటికైనా నిర్భయ కేసు నిందితులకు శిక్షపడేలా చేయాలని వేడుకుంటున్నాని అన్నారు. ఇలాంటి శిక్షలు విధిస్తే చెడ్డపనులు చేడానికి ప్రతీ ఒక్కరూ భయపడతారాని నిర్భయ తల్లి వివరించారు. తెలంగాణ పోలీసులు గొప్ప పని చేశారన్న ఆమె... పోలీసులపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: