కావాల్సిన ప‌దార్థాలు:
స్వీట్‌ పొటాటో- ఐదు
ఉప్పు- రుచికి స‌రిప‌డా
దాల్చిన చెక్క‌ల పొద్దిగా- అర టీ స్పూన్‌

 

ల‌వంగాల పొడి- అర టీ స్పూన్‌
ఆలివ్ నూనె- స‌రిప‌డా
ధ‌నియాల పొడి- కొద్దిగా

 

తయారీ విధానం:
ముందుగా స్వీట్ పొటాటోల‌ను నిలువుగా త‌గిరి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని పెద్ద జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి అందులో కొంచెం ఆలివ్‌ నూనె, వెల్లుల్లి, దాల్చిన చెక్కల పొడి, ల‌వంగాల పొడి, ధ‌నియాల పొడి వేసి ముక్కలకు పట్టేలా బ్యాగ్‌ను అటుఇటు కలిపి ప‌క్క‌ప పెట్టాలి. ఇప్పుడు ఒవెన్‌ను 425 డిగ్రీల వరకు వేడిచేయాలి. 

 

ఆ త‌ర్వాత ముక్కలను బేకింగ్‌ షీట్‌ మీద వేయాలి. అయితే ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు స్వీట్ పొటాటో ముక్కలను ఉంచిన బేకింగ్‌ షీట్‌ను ఒవెన్‌లో పది నిమిషాలు ఉంచాలి. తరువాత ముక్కలను తిప్పి మరో పది నిమిషాలు ఒవెన్‌లో ఉంచాలి. అవి లోపల మెత్తగా ఉడికి బయటి వైపు గోధుమ రంగుకి వ‌చ్చే వ‌ర‌కు ఉంచి బ‌య‌ట‌కు తీస్తే స‌రిపోతుంది. అంతే క్రంచీ క్రంచీ స్వీట్‌ పొటాటో ఫ్రైస్ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: