కొంతమంది ఎంతో ధర పెట్టి మరి ఆహారాన్ని తీసుకుంటారు.. కానీ అది రుచి ఉండదు ఎం ఉండదు.. అసలు కారమే ఉండదు. ఇంకా రాయలసీమ వారికీ అయితే కారం లేనిదే ముద్దా దిగదు.. ఎంత కాస్టలీ ఫుడ్ తింటే ఎం లాభం నోటికి రుచిలేకపోతే.. అందుకే అలాంటి సమయంలో ఇంట్లో చేసుకొని తినాలి.. ఆలా అని మ్యాగీ చేసుకొని తినటం కాదు.. చెప్పబడిన నాలుక నుండి పొగలు వచ్చేలా ఏదైనా కారం చేసుకొని తినాలి.. ఆ కారం మాములుగా ఉండకూడదు ఉల్లి కారంల ఉండాలి.. అయితే ఇప్పుడు వెరైటీగా బీరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్థాలు.. 

 

పొట్టు తీసి కోసిన ఐదు బీరకాయలు, 

 

కొద్దిగా నూనె,

 

పెద్ద ఉల్లిపాయి ముక్కలు,

 

ఒక టేబుల్‌ స్పూను నూనె,

 

శెనగపప్పు: అర టేబుల్‌స్పూను,

 

మినప్పప్పు: అర టేబుల్‌స్పూను,

 

జీలకర్ర: అర టేబుల్‌స్పూను,

 

ఆవాలు: అర టేబుల్‌స్పూను,

 

ఎండుమిర్చి: 2,

 

కొద్దిగా నెయ్యి,

 

చక్కెర, ఉప్పు తగినంత,

 

తయారీ విధానం...  

 

పాన్‌లో కొద్దిగా నూనె వేడెక్కాక అందులో బీరకాయముక్కల్ని వేయాలి. మూతపెట్టకుండా బీరకాయ ముక్కల్ని ఉడకనిస్తే నీరు బయటకు వచ్చేస్తుంది. అలా ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. బీరకాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. వేరే పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ గుజ్జు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకూ వేగించాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేయాలి. మరో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అందులో మినప్పప్పు, శెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి వేసి సువాసన వచ్చే వరకూ వేగించాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడిచేయాలి. ఆ పొడిని ముందుగానే నూనెలో వేగించిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఉడికిన బీరకాయ ముక్కల్లో వేయాలి. కూరలో నీరు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఈ కూరలో ఒక టీస్పూను చక్కెర, ఉప్పును వేసి కలిపి స్టవ్‌ మీద కొద్ది నిమిషాలు ఉంచి కాస్త డ్రై అయిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించాలి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ కూర తింటే చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: