దిశ సంఘటన వల్ల మనకి "జీరో యఫ్ ఐ ఆర్ "అమలులోకి వచ్చింది 


   అసలు ఈ "జీరో ఎఫ్ ఐ ఆర్ "అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. దిశ సంఘటన తర్వాత ఈ జీరో ఎఫ్ఐఆర్ ను ప్రవేశపెట్టారు. దిశ కనిపించడం లేదు అని, ఫోన్లో తమ కూతురితో మాట్లాడిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని, తమ కూతురు జాడాతెలియలేదని, ఇంకా ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి వెళితే అక్కడ పోలీసులు ఈ కేసు మా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు అని కేసు నమోదు చేసుకోలేదని, వేరే పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని దిశ తల్లి తండ్రులు ఆరోపించారు. సరైన సమయంలో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తీసుకుని దర్యాప్తు చేస్తే మా అమ్మాయి బ్రతికి ఉండేదని ఆరోపించారు.

 

ఈ వార్తతో రాష్ట్రం మొత్తం అప్రమత్తం అయ్యి రాష్ట్రం లో ఏ పోలీస్ స్టేషన్ కి అయినా వచ్చే బాధితుల దగ్గర నుండి ఫిర్యాదు తీసుకోవచ్చు అని, వెంటనే "జీరో "యఫ్ ఐఆర్ కేసు కింద నమోదు చేసుకోవాలని డీజీపీ ఆదేశాలను జారీ చేసారు.


ఈ జీరో యఫ్ ఐ ఆర్ కేసుని తెలంగాణ పోలీసులు మొట్టమొదటి సారిగా నమోదు చేసుకున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హన్మకొండలో సుబేదారి పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 7 శనివారం ఈ కేసు ఫైల్ అయింది. 24 ఏళ్ల వయసు అమ్మాయి మిస్సింగ్ కేసు పై యువతి కుటుంబసభ్యులు పిర్యాదు చేసారు.

శాయo పేట నియోజకవర్గo పరిధి గోవిందాపూర్ కి చెందిన యువతీ అదృశ్యం పై సుబేదారి పోలీసులు జీరో యఫ్ఐ ఆర్ కేసు నమోదు చేసారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు భాదితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు. యువతీ కాల్ డేటా ఆధారంగా ఇరువర్గాల పోలీసులు విచారణ మొదలుపెట్టారుపెట్టారు..

ఇలా అయినా మన దేశంలో బాధితుల సంఖ్య తగ్గవచ్చునేమో? "దిశ కేసు మన దేశం దశ మార్చుతుంది. "అని నిరూపణ అయింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: